పార్టీలో పట్టు కోసం శశికళ పావులు: వారికి కీలక పదవులు
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పార్టీ పైన పట్టు చిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు ఆమె పలువురు నేతలకు కీలక పదవులను కట్టబెట్టారు.
తమిళనాడు: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పార్టీ పైన పట్టు చిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె పదవి చేపట్టాక కొంత రివర్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా, శుక్రవారం నాడు ఆమె పలువురు నేతలకు కీలక పదవులను కట్టబెట్టారు. అందులో మంత్రులు, సీనియర్ నేతలు, మాజీ మేయర్ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి కేఏ శెంగోట్టాయన్, ఎస్ గోకులా ఇందిరా, బీవీ రమణ, మాజీ మేయర్ సైదాయి ఎస్ దురైసామీలకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు. వీరిని ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శశికళ నియమించారు.

మాజీ మంత్రులు బీవీ రమణ, అరుణాచలం ఇతర నాయకులు వి సోమసుందరం, పీఎం నరసింహన్, ఎంఎస్ నిరైకులతన్, అంబలగన్, అన్నమలై, ఉమాదేవన్.. తదితరులను కూడా ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నియమించారు.
మత్య్సశాఖ మంత్రి డి. జయకుమార్, మాజీ మంత్రులు జయబాల్, నైనార్ నాగేంద్రం, వైగై చెల్వన్, శివపతిలకు కూడా కీలక పదవులు అప్పగించారు. పార్టీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన తర్వాత ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్ నేతలతో పెద్ద ఎత్తున వరస సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాతే కొత్త నియామకాలతో ఇవాళ్టి ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications