Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళ రాజకీయాల్లో కుదుపు: శశికళ ఆగమనం: వచ్చేనెలే విడుదల: బీజేపీ నేత ట్వీట్ చేయడంపై

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో హీటెక్కబోతున్నాయి. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శశికళ నటరాజన్ వచ్చేనెల 14వ తేదీన జైలు నుంచి విడుదల కాబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ఆచారి చేసిన ఓ ట్వీట్.. చిన్న కుదుపు ఇచ్చినట్టయింది. అందరి దృష్టీ శశికళపై పడింది.

Recommended Video

    Sasikala Natarajan Likely To Be Released From Jail On 14th August 2020 || Oneindia Telugu

    తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే సమయంలో శశికళ విడుదల కాబోతున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమౌతున్నాయి. అది కూడా ఆమె విడుదలవుతున్నారనే సమాచారాన్ని బీజేపీ నాయకుడు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గడువు కంటే ముందే ఆమెను విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. ఈ దిశగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిందనేది హాట్ టాపిక్.

    Sasikala is likely to be released from Bengaluru Jail on 14th August, BJP leader tweets

    2016 నాటి ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని అన్నా డీఎంకే ఘర విజయం సాధించింది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా జయలలిత వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎక్కువకాలం జీవించలేకపోయారు. అనారోగ్యానికి గురైన ఆమె చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే ఏడాది డిసెంబర్‌లో కన్నుమూశారు. అనంతరం శశికళ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకుంటారని భావించినప్పటికీ.. అనూహ్యంగా ఆమె జైలుపాలు అయ్యారు.

    అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 2017 ఫిబ్రవరిలో ఆమె జైలుపాలు అయ్యారు. ప్రస్తుతం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహారలోని కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో అన్నా డీఎంకే.. బీజేపీకి చేరువ అయింది. ఆగస్టు 14వ తేదీ ఆమె విడుదల అవుతారంటూ బీజేపీ నాయకుడు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంకా శిక్షాకాలం మిగిలే ఉన్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమెను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+