ఇదే చాన్స్: తమిళనాడు సీఎంగా చిన్నమ్మ శశికళ, డేట్ ఫిక్స్ చేశారు !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ నటరాజన్ ముమ్మరంగా పావులుకదుపుతున్నారు. ఇక ఆలస్యం చేస్తే ఫలితం లేదని శశికళ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
తమిళనాడులో జల్లికట్టు నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే చీఫ్ శశికళను కలిసి శాంతిభద్రతల విషయంపై చర్చించారు.

అయితే పన్నీర్ సెల్వం మాటలను ఆందోళనకారులు లెక్కచెయ్యకపోవడంతో ఆయన్ను సీఎం సీటు నుంచి కిందకు దించెయ్యడానికి ఇదే మంచి సమయం అని శశికళ వర్గీయులు నిర్ణయించారని సమాచారం.
శాంతిభద్రతలు కాపాడటంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ పన్నీర్ సెల్వంను సీఎం సీటు నుంచి తప్పించి ఆ కుర్చీలో చిన్నమ్మను కుర్చోపెట్టడానికి అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయని సోమవారం వెలుగు చూసింది. జనవరి 28వ తేదీ ఆదివారం శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications