సూపర్ డూపర్ టీవీకి మాకు సంబంధం లేదు: శశికళ ఫ్యామిలీ, జైల్లోనే చిన్నమ్మను !
సూపర్ డూపర్ టీవీకి మాకు ఎలాంటి సంబంధం లేదు.మాకు ఏ పాపం తెలీదు అంటూ శశికళ ఫ్యామిలీ కోర్టులో ఆవేదన.జైల్లో శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన ఎగ్మూరు ప్రత్యేక కోర్టు.
బెంగళూరు/చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసు, సూపర్ డూపర్ టీవీ కేసులో చిన్నమ్మ శశికళను చెన్నైలోని ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేశారు. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను బుదవారం చెన్నైలోని ఎగ్మూరు కోర్టు విచారించింది.
విదేశీ మారక ద్రవ్యం కేసులో మంగళవారం శశికళ కుటుంబ సభ్యులు ఎగ్మూరు కోర్టు ముందు విచారణకు హాజరైనారు. జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, టీటీవీ దినకరన్ సోదరుడు టీటీవీ భాస్కరన్ ఎగ్మూరు కోర్టు ముందు హాజరై తమ వాదనను వినిపించారు.

తనకు ఏ పాపం తెలీదని, అనవరసరంగా ఈే కేసులో ఇరికించారని జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. సూపర్ డూపర్ టీవీకి ఎలక్ట్రానిక్ వస్తువుల కోనుగోలుతో మాకు ఎలాంటి సంబంధం లేదని సుధాకరన్ కోర్టులో చెప్పాడు.
టీటీవీ భాస్కరన్ తన వాదనను కోర్టులో వినిపించారు. ఈకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా శశికళను విచారించిన న్యాయస్థానం ఆమె వాదనను రికార్డు చేసుకున్నారు. జులై 12వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు. మొత్తం మీద చిన్నమ్మ శశికళ తంత్రంతోనే సుధాకరన్, భాస్కరన్ కోర్టులో తమ వాదన వినిపించారని సమాచారం.












Click it and Unblock the Notifications