సౌదీ రాజు ఆగ్రహం: వెలుగులోకి యువరాజు అరాచకాలు(వీడియో)
సౌదీలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఎలాగంటే.. పలువురిపై దాడికి పాల్పడిన వీడియోలు వెలుగుచూడటంతో సౌదీ రాకుమారునిపై ఆ దేశ రాజు సల్మాన్ ఆగ్రహం.
సౌదీఅరేబియా: సౌదీలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఎలాగంటే.. పలువురిపై దాడికి పాల్పడిన వీడియోలు వెలుగుచూడటంతో సౌదీ రాకుమారునిపై ఆ దేశ రాజు సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని, అతని అనుచరులని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
أمير سعودي يعتدي على مواطنيين ويهينهم.
— غانم الدوسري (@GhanemAlmasarir) July 19, 2017
اتمنى ان يصل الهاشتاق ترند لكي يعرف العالم العبودية التي يعيشها الشعب .#امير_يعتدي_على_مواطنين pic.twitter.com/ImCsxwOtJe
అసలేం జరిగిందంటే.. సౌదీ ప్రిన్స్ సాద్ బిన్ అబ్దులాజిజ్.. స్థానిక పౌరుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ మనిషికి తుపాకీ ఎక్కుపెట్టి బెదిరిస్తునట్లు ఆ వీడియోలో ఉంది. మరో వీడియోలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టినట్లు ఉంది. అంతేగాక, కొన్ని వీడియోల్లో పలు మద్యం బాటిళ్లు కూడా దర్శనమిచ్చాయి. ఆ దేశంలో ప్రస్తుతం మద్యపాన నిషేధం అమలులో ఉంది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ప్రిన్స్‌ని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దేశ ప్రజల ప్రయోజనాలకంటే రాజకుటుంబ ప్రయోజనాలు ముఖ్యం కావని సల్మాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేగాక, వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపినందుకు 2013 అక్టోబర్‌లో ఓ సౌదీ ప్రిన్స్‌ను ఉరితీసిన విషయం తెలిసిందే.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications