శుభవార్త: రూ.30 లక్షలలోపు గృహరుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

ఎస్ బి ఐ గృహరుణాలపై వడ్డీరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. రూ. 30 లక్షలలోపుగా ఉన్న లోన్లపై 25 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం నాడు ఎస్ బి ఐ ప్రకటించింది.

ముంబై: ఎస్ బి ఐ గృహరుణాలపై వడ్డీరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. రూ. 30 లక్షలలోపుగా ఉన్న లోన్లపై 25 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం నాడు ఎస్ బి ఐ ప్రకటించింది.

గృహరుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు మంగళవారం నుండి (మే 9వ,తేది) నుండి అమల్లోకి రానున్నట్టు ఎస్ బి ఐ ప్రకటించింది. ప్రస్తుతమున్న వడ్డీరేటు 8.6 శాతం నుండి 8.35 శాతంగా ఉండనుంది. అలాగే ప్రధానమంత్రి అవాస్ యోజన (అర్భన్) పథకం కింద రుణం తీసుకొనే ఖాతాదారులు కనీసం రూ.2.67 లక్షలు సబ్సీడీ పొందే అవకాశం ఉంది.

SBI cuts home loan rate by 25 bps for loans up to Rs 30 lakh.

ఈ పథకం కింద మద్య ఆదాయ వర్గాలవారు మొదటిసారి గృహరుణ గ్రహీతలు ఈ తగ్గింపును పొందే అవకాశం ఉంది. తమ రేట్లు తగ్గింపుతో గృహకొనుగోలుదారులకు సరసమైన ధరలో గృహాలు స్వంతం చేసుకొవాలనుకొనేవారు మిలియన్ల మంది కల నెరవేరనుంది.

మరోవైపు ఈ ప్రభావం మార్కెట్ లో షేర్ ధరపై చూపనుంది. ఇంట్రాడేలో రూ. 300 మార్క్ , మరోసారి టచ్ చేసిన ఎస్ బి ఐ అనంతరం రూ.249 పతనమైంది. మళ్ళీ కోలుకొని దాదాపుగా 2 శాతం లాభాలతో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+