ఎస్బీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 31 జనవరి 2019.
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 31
పోస్టు పేరు : డిప్యూటీ మేనేజర్, ఎగ్జిక్యూటివ్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 31 జనవరి 2019

విద్యార్హతలు:
డిప్యూటీ మేనేజర్: స్టాటిస్‌టిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్
ఎగ్జిక్యూటివ్: చార్టర్డ్ అకౌంటెంట్
వయస్సు : 1 డిసెంబరు 2018 నాటికి
ఎగ్జిక్యూటివ్: 22 నుంచి 30 ఏళ్లు
డిప్యూటీ మేనేజర్: 35 నుంచి 42
వేతనం:
డిప్యూటీ మేనేజర్: నెలకు రూ. 31705 - 45950/-
ఎగ్జిక్యూటివ్ : వేతనం మాట్లాడుకోవచ్చు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ. 100/-
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 9 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 31 జనవరి 2019












Click it and Unblock the Notifications