వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళనిస్వామికి ఎదురుదెబ్బ: విశ్వాసపరీక్షపై తేలుస్తామన్న సుప్రీం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి సుప్రీంకోర్టులు చుక్కెదురైంది. ఇటీవల తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వచ్చిన విషయం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి సుప్రీంకోర్టులు చుక్కెదురైంది. ఇటీవల తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు వెళ్లడంతో ఉన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తన తీర్పులో.. తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష తీరును పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జయలలిత మరణాంతరం తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళ, సీఎం పళనిస్వామి వర్గాలు నడిపన బేరసారాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

SC to examine validity of TN trust vote

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 4కోట్లు ఇచ్చేందుకు కూడా శశికల సిద్ధపడినట్లు ప్రచారం సాగింది. కాగా, ఓ జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ వాస్తవాలు వెలుగుచూడటం గమనార్హం. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ డబ్బుతోపాటు బంగారం కూడా పళనిస్వామి అందజేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

English summary
The Supreme Court will verify the validity of the trust vote by Tamil Nadu Chief Minister, E Palanisamy. The court decided to take up the matter after a petition was filed in which the validity of the trust vote was questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X