సుప్రీం అసాధారణ చర్య-9 రాజకీయ పార్టీలకు జరిమానా-అభ్యర్ధుల నేరచరిత్ర దాచినందుకు
దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులపై నమోదైన కేసుల్ని వెల్లడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా కేసులు వెల్లడించని 9 రాజకీయ పార్టీలపై కొరడా ఝళిపించింది. వీరికి స్ధాయిని బట్టి జరిమానా విధించడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దుల నేర చరిత్రను ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు బహిర్గతం చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా రాజకీయ పార్టీలు మాత్రం పట్టించుకోలేదు. దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు... కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంది. మొత్తం 9 రాజకీయ పార్టీలకు జరిమానా విధిస్తూ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పాటు మరో ఐదు పార్టీలకు తలో లక్ష రూపాయలు చొప్పిన జరిమానా విధించిన న్యాయస్దానం... సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇకపై రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్ధుల నేరచరిత్రను పార్టీ వెబ్ సైట్లలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం ఓ మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది.
ఎన్నికల్లో పోటీ కోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల్ని ఎంపిక చేసుకున్న 48 గంటల్లోపు వారి నేర చరిత్రను వెబ్ సైట్లలో ఉంచాలని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీహార్ ఎన్నికల సందర్భంగా దాఖలైన కేసుపై స్పందించిన సుప్రీంకోర్టు.. అభ్యర్ధుల్ని ఎంపిక చేసిన 48 గంటల్లో లేదా నామినేషన్ల దాఖలుకు రెండు వారాల ముందు ఈ సమాచారాన్ని పార్టీలు తమ వెబ్ సైట్లలో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కేవలం 48 గంటలకు కుదించింది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications