బాబ్రీ కూల్చివేత కేసు- అద్వానీ, జోషీ, ఉమాభారతి భవితవ్యంపై తీర్పు- సుప్రీం కొత్త డెడ్‌లైన్...
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిల భవితవ్యాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు కొత్త డెడ్ లైన్ ప్రకటించింది. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో వాదనలు దాదాపుగా పూర్తి కావడంతో సీబీఐ కోర్టు తీర్పు ప్రకటించేందుకు సీబీఐ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను పొడిగించింది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వచ్చే నెల 30న తుది తీర్పు ప్రకటించేందుకు సీబీఐ కోర్టుకు అవకాశం కల్పిస్తూ స్తామని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ రోహింటన్ నారిమన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం, అయోధ్య జడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పు ప్రకటించే తేదీని పొడిగించింది. ఈ కేసులో విచారణ పూర్తి సేందుకు తనకు మరి కొంత సమయం కావాలన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఇదే విజ్ఞప్తితో గతంలో ఆగస్టు 31 లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చినా పలు కారణాలతో విచారణ ఆలస్యమైనందున మరోసారి పొడిగింపు ఇవ్వక తప్పలేదు.

Recommended Video
కరోనా కారణంగా అయోధ్యలోని ప్రత్యేక సీబీఐ కోర్టు విచారణ నానాటికీ ఆలస్యమవుతోంది. ఇందులో బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతికి వ్యతిరేకంగా దాఖలైన బాబ్రీ మసీదు విధ్వంసం కేసుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. అయితే అయోధ్య స్ధలం యాజమాన్య హక్కులపై కూడా క్లారిటీ వచ్చినందున ఇక విధ్వంసం కేసునూ త్వరగా ముగించాలని సుప్రీం ధర్మాసనం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సూచించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications