viral video:వామ్మో.. బస్సులోనే బీర్ కొట్టిన స్టూడెంట్.. ఎక్కడ అంటే..?
స్కూళ్లు నడుస్తున్నాయ్. పరీక్షలు జరుగుతున్నాయి.. కరోనా ఇంఫాక్ట్ అంతగా లేకపోవడంతో అంతా రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. అయితే కొందరు అల్లరి విద్యార్థులు మాత్రం అలానే ఉన్నారు. ఏం మారలేదు. అవును.. కరోనా వల్ల దాదాపు రెండేళ్లు వేస్ట్ అయ్యింది. చక్కగా చదువుకుందాం అని లేదు. ఎప్పటిలానే అల్లరి.. చేస్తున్నారు. అబ్బాయిలు అయితే ఓకే.. కానీ అమ్మాయిలు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది.

బస్సులో బీర్ కొట్టిన విద్యార్థినీ..
చెంగల్పట్టు జిల్లాలో గల ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్టూడెంట్స్ బస్సులో వస్తున్నారు. అయితే అమ్మాయిలతోపాటు అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే అందులో ఒక విద్యార్థిని బీర్ తాగుతూ కనిపించింది. అవును మీరు చదివేది నిజమే.. ఆ గ్రూపులో గల మిగతా స్టూడెంట్స్ దీనిని వీడియో తీశారు. ఆమె ఏం చక్కా బీర్ లాగించేస్తోంది. వీడియో చూసిన వెంటనే అదీ పాత వీడియో అనుకున్నారు. కానీ తర్వాత మంగళవారం జరిగిన ఘటనగా నిర్ధారించారు. ధరించిన యూనిఫాం ద్వారా వారు తిరుకజుకుండ్రం నుంచి థాచూర్ వెళుతున్నట్టు గుర్తించారు.

మరీ వారేం చేస్తున్నారు..
ఘటనపై జిల్లా విద్యాశాఖ స్పందించింది. పోలీసులు విచారణ జరుపుతున్నారని డీఈవో తెలిపారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎవరినీ ఉపేక్షించబోమని తెలిపారు. అయితే వారికి బీర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది..? బస్సులో ఎలా తాగారు అనే ప్రశ్న వస్తోంది. ప్రభుత్వ పాఠశాలకు చెందినవారు కావడంతో.. అందులో మిగతా ప్యాసెంజర్స్ కూడా ఉంటారు. మరీ వారు ఏమీ అభ్యంతరం తెలుపలేదా అనే సందేహాం కలుగుతుంది. డ్రైవర్ బస్సు నడుపుతున్న.. కండక్టర్ కూడా ఉండే ఉంటారు కదా అని సస్పెక్ట్ చేయాల్సి వస్తోంది. కానీ ఆ బస్సు వారి కోసం కేటాయించిందా..? లేదంటే ఆర్టీసీ బస్సు అనేది తెలియాల్సి ఉంది.

యూనిఫామ్ వేసుకొని మరీ..
ఈ ఘటన దుమారం రేపింది. తమిళనాడును ఒక కుదుపు కుదిపేసింది. విద్యార్థిని.. యూనిఫాం వేసుకొని మరీ బీర్ కొట్టడం ఏంటీ అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ స్పందించింది. కానీ చర్యలు మాత్రం తీసుకోవాల్సి ఉంది. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టూడెంట్స్ మరీ ఇంత దిగజారారా అని మేధావులు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications