గదిలో బంధించి వ్యభిచారం: విద్యార్థుల సాయంతో సెక్స్ రాకెట్ రట్టు
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల సాయంతో పశ్చిమ బెంగాల్లో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ సెక్స్ రాకెట్‌కు చెందిన కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం పేరుతో అందమైన అమ్మాయిలకు ఎరవేసే ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వారి చెరలో ఉన్న పలువురు యువతులకు విముక్తి లభించింది. ఉద్యోగం పేరుతో అమ్మాయిలకు ఎరవేసే ఈ ముఠా గదిలో బంధించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తుంది. వ్యభిచారానికి అంగీకరించకుంటే రహస్యంగా వారిని ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

బాలికలు, యువతులను కిడ్నాప్ చేసి వారిని బార్లలో డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇప్పిస్తానని ఆశ కల్పిస్తారు. డార్జిలింగ్, నేపాల్, సిక్కిం ప్రాంతాల నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకు వస్తారు. గుర్గావ్, ఢిల్లీ ఏరియాలకు వీరిని అక్రమ రవాణా చేస్తుంటారు.
వారితో వ్యభిచారం చేయించడం, ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేయడం జరుగుతుంటుంది. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడు గగన్‌ను గుర్గావ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 2లోని ఇంట్లో హర్యానా పోలీసుల సహాయంతో డార్జీలింగ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.
మరో నిందితుడు సున్నీ తమాంగ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. వుమెన్ ట్రాఫికింగ్ పైన ఓ ఎన్జీవో సంస్థ పని చేస్తోంది. ఇందులో పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు. వారి సహకారంతో పోలీసులు ఈ సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications