బిగ్ బాస్ కు లేనిపోని సమస్యలు, నిన్న సార్, నేడు మేడమ్, అవసరమా ఫ్రెండ్, బెయిల్ రాదు !
బెంగళూరు: బిగ్ బాస్ కన్నడ సీజన్ 10లో పోటీ చేసిన తనీషాపై బెంగళూరు శివార్లలోని కుంబలగోడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ (SC/ST) అట్రాసిటీ చట్టం కింద నటి తనీషాపై కేసు నమోదైంది.
కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 రియాల్టీ షో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌ను పులి లాకెట్ వేసుకున్నాడని అటవీ శాఖ అధికారులు అతన్ని అరెస్టు చేసి వారం రోజుల పాటు జైలులో పెట్టారు.
ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ తనీషాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు తానీషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై కుంబల్‌గోడు పోలీస్ స్టేషన్‌లో అఖిల కర్ణాటక బోవి సమాజ్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. పద్మ ఫిర్యాదు చేశారు. పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు తనీషాపై కేసు నమోదు చేశారు.

ప్రైవేట్ ఛానల్ బిగ్ బాస్ రియాల్టీ షోలో వడ్డెర కులాన్ని కించపరిచే పదాలు వాడారని తనీషాపై ఆరోపణలు వచ్చాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పరిధిలోకి వచ్చే బోవి (వడ్డెర) వర్గాన్ని సీరియల్ నటి తానీషా అవమానించిందని ఫిర్యాదు నమోదైంది. నటి తనీషా కుప్పుందా అలియాస్ తనీషాపై ఫిర్యాదు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు.
సోమవారం నుంచి శుక్రవారం రాత్రి ఓ కన్నడ ఛానెల్‌లో ప్రసారమయ్యే బిగ్ బాస్ కన్నడ రియాల్టీ షోలో, డ్రోన్ ప్రతాప్‌తో తనీషాల మధ్య జరిగిన సంభాషణలో భోవి జాతి (వడ్డెర) గురించి అవమానకరంగా మాట్లాడాడు. పైకిలైరా ఒడ్డోడా) అనే పదాన్ని వాడాడు. కర్ణాటక రాష్ట్రంలోని భోవి వర్గానికి అవమానం కలిగించారని, తానీషా భోవి జాతి (వడ్డార్లు) గురించి మాట్లాడే నైతికతలేదు పద్మా మండిపడ్డారు.

కులం గురించి మాట్లాడడం మర్యాదకాదని, ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా తాలూకాల్లో తనీషాకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించామని అన్నారు. షెడ్యూల్డ్ కులాలు అని తెలిసి ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా మాట్లాడారని, వడ్డార్లు అంటూ పదేపదే మాట్లాడారని పద్మా ఆరోపించారు. దండు పాళ్య 2లో నటిగా తనీషా కన్నడ చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యింది.
తనీషా ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్‌లో డాన్ ప్రతాప్, తనీషా మధ్య జరిగిన సంభాషణలో కులపరమైన అవమానం చేసింది. వారిని తక్షణమే బిగ్ బాస్ హౌస్ నుండి తరిమివేయాలని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసి, వారిని వెంటనే అరెస్టు చేసి వడ్డర సంఘం గౌరవాన్ని కాపాడాలని పోలీసులకు మనవి చేశారు. కర్ణాటకలో మెజారిటీ ఓటర్లు ఉన్న వడ్డెర్లను నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇలా మట్లాడటంతో సామాన్య ప్రజలు కూడా మండపడుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications