Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా సెకండ్ వేవ్: దేశంలో వారం నుంచి గంటకు 10వేల కొత్త కేసులు, 60 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తొలి దశ కంటే రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వారం రోజులుగా దేశంలో రోజుకు 2 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గత కొద్ది రోజుల నుంచి సగటున గంటకు 10వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా, 60 మరణాలు సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఏప్రిల్ 1న దేశ వ్యాప్తంగా 72 వేల కొత్త కేసులు వెలుగుచూడగా, 459 మరణాలు సంభవించాయి. ఆనాడు సగటున గంటకు 3వేల కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. అయితే, గత ఆదివారం నాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత ఆదివారం దేశంలో సగటున గంటకు 10,895 కొత్త కేసులు వెలుగుచూడగా, గంటకు 60 మంది కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

Second Wave: India Reporting Over 10,000 Fresh Corona Cases, 60 Deaths Per Hour Since Sunday

సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 2,59,170 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే, సగటున గంటకు 10,798 కేసులు వస్తున్నాయి. ఇక మరణాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి.

గత సెప్టెంబర్ నెలలో కరోనా తీవ్రరూపం దాల్చిన సమయంలో రోజువారీగా గరిష్టంగా 97వేల కేసులు నమోదయ్యాయి. అయితే, అక్టోబర్ తర్వాత క్రమంగా కేసులు తగ్గుకుంటూ వచ్చాయి. ఫిబ్రవరి నెలలో ఒక దశలో 10వేల కంటే తక్కువే కేసులే నమోదయ్యాయి. ఇక కరోనా మహమ్మారికి కాలం చెల్లిందనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఈ ఏడాది మార్చి నెల నుంచి కరోనా కేసులు పెరుగుకుంటూ వస్తున్నాయి.

కాగా, దేశంలో గత 24 గంటల్లో 2,59,170 కరోనా కేసులు నమోదు కాగా, 1761 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. మరణాల సంఖ్య 1,80,530కి చేరింది. ప్రస్తుం దేశంలో 20,31,977 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+