బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Second wife: కోటీశ్వరుడు, భార్యకు బెల్లం బర్ఫీ, ఉంచుకున్నదానికి వడ్డానం, రియల్ వ్యాపారి ఫినిష్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఐటీ హబ్ శివార్లలో ఎకరాల ఎకరాల భూములు తీసుకుని వెంచర్లు, లేఔట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించాడు. అనుకోని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు రావడంతో భర్త అడ్డదారి తొక్కాడు. ఎర్రగా, బుర్రగా ఉన్న మహిళ బ్యూటీపార్లల్ నిర్వహిస్తోంది. బ్యూటీపార్లల్ బ్యూటీ అందానికి ఫిదా అయిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొన్ని సంవత్సరాల నుంచి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బ్యూటీపార్లల్ లేడీ ఒత్తిడి చెయ్యడంతో కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు రూ. 8 కోట్లతో పెద్ద బంగ్లా కట్టించాడు. రెండో భార్యతో ఎక్కువగా కాలం గడుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమె చేతిలోనే కుక్కచావు చచ్చాడు. వ్యాపారలావాదేవీల కోసం ఫ్రెండ్స్ తో తనను పడుకోమని తన భర్త టార్చర్ చెయ్యడంతో అతన్ని చంపేశానని రెండో భార్య పోలీసులకు చెప్పింది. మా ఆస్తి మొత్తం లాక్కోవాలని తన భర్తను తన భర్తను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ చంపేసిందని మొదటి భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి తండ్రి కలిసి బ్యూటీపార్లల్ లేడీ మీద కేసు పెట్టడం కలకలం రేపింది.

Wife: బాత్ రూమ్ లో మొగుడు, టవల్ త్వరగా ఇవ్వలేదని ఆంటీని చంపేశాడు, చూసి తట్టుకోలేకపోయాడు !Wife: బాత్ రూమ్ లో మొగుడు, టవల్ త్వరగా ఇవ్వలేదని ఆంటీని చంపేశాడు, చూసి తట్టుకోలేకపోయాడు !

 బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం

బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం

ఐటీ హబ్ బెంగళూరులో సలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ అలియాస్ రాజ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం టీఆర్, సత్యకుమారి అనే మహిళతో స్వామిరాజ్ వివాహం జరిగింది. స్వామిరాజ్, సత్యకుమారి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

 కోట్లు సంపాధిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి

కోట్లు సంపాధిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి

ఐటీ హబ్ శివార్లలో ఎకరాల ఎకరాల భూములు తీసుకుని వెంచర్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ రూ. కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించాడు. ఎక్కువగా బెంగళూరు ఉత్తర తాలుకాలో లేఔట్లు వేసి ఫ్లాట్ లో కొట్టి విక్రయిస్తున్నాడు. అనుకోని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు రావడంతో స్వామిరాజ్ విలాసాలకు బానిస అయ్యాడు.

 బ్యూటీపార్లల్ బ్యూటీతో అక్రమ సంబంధం

బ్యూటీపార్లల్ బ్యూటీతో అక్రమ సంబంధం

బెంగళూరు నగర శివార్లలోని మాదనాయకనహళ్ళిలో లేఔట్ వేసే సమయంలో స్వామిరాజ్ కు బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న నేత్రావతి అలియాస్ నేత్రా (37) అనే మహిళ పరిచయం అయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు రావడంతో స్వామిరాజ్ అడ్డదారి తొక్కాడు. ఎర్రగా, బుర్రగా ఉంటూ బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న నేత్రాతో స్వామిరాజ్ కు చనువు ఎర్పడింది.

 అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

బ్యూటీపార్లల్ బ్యూటీ నేత్రా అందానికి ఫిదా అయిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ఐదు సంవత్సరాల నుంచి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య సత్యకుమారికి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తున్న స్వామిరాజ్ ఎక్కువగా అక్రమ సంబంధం పెట్టుకున్న నేత్రాతో కాలం గడపడం మొదలుపెట్టాడు. రానురాను రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ అతని ప్రియురాలు నేత్రా ఏమి కావాలంటే అది ఇచ్చేయడం మొదలుపెట్టాడు.

 రూ. 8 కోట్లతో విలాసవంతమైన బంగ్లా

రూ. 8 కోట్లతో విలాసవంతమైన బంగ్లా

మొదటి భార్య సత్యకుమారితో వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న స్వామిరాజ్ వ్యాపారం పని అంటూ ఎక్కువగా అతని ప్రియురాలు నేత్రాతో కాలం గడిపాడు. స్వామిరాజ్ ఆస్తులు చూపిన నేత్రా అతని మీద ఒత్తిడి చేసి అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. బెంగళూరు-తుమకూరు రోడ్డు సమీపంలోని మాదనాయకనహళ్ళి ప్రాంతంలో రూ. 8 కోట్ల ఖర్చు పెట్టిన స్వామిరాజ్ అతని రెండో భార్య నేత్రాకు విలాసవంతమైన బంగ్లా కట్టించాడు.

 భార్యకు బెల్లం బర్ఫీ..... ఉంచుకున్న దానికి వడ్డానం

భార్యకు బెల్లం బర్ఫీ..... ఉంచుకున్న దానికి వడ్డానం

రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ కొత్తగా రెండో భార్య నేత్రాకు కట్టించిన బంగ్లాలో ఎక్కువగా నివాసం ఉంటూ అక్కడే ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో వారంలో ఒకరోజు లేదా రెండు రోజులు అతని భార్య సత్యకుమారి ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇదే విషయంలో స్వామిరాజ్ తండ్రి బసవరాజ్ అనేకసార్లు అతని కొడుకును మందలించాడని తెలిసింది. తరువాత కట్టుకున్న భార్య సత్యకుమారికి బెల్లం బర్ఫీ మాత్రం ఇస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ అతని రెండో భార్య నేత్రాకు వడ్డానం, బంగారు నగలు తీసిస్తున్నాడని తెలిసింది.

రాత్రి రెండో భార్య చేతిలో కుక్కచావు చచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

రాత్రి రెండో భార్య చేతిలో కుక్కచావు చచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

రాత్రి బయట పని ముగించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని రెండో భార్య నేత్రా ఉంటున్న మాదనాయకనహళ్ళి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో నేత్రా, స్వామిరాజ్ మద్య గొడవ జరిగిందని తెలిసింది. తరువాత స్వామిరాజ్ ను అతని రెండో భార్య నేత్రా దారుణంగా చంపేసింది. స్వామిరాజ్ ను హత్య చేసిన నేత్రా నేరుగా మాదనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త స్వామిరాజ్ ను చంపేశానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు

 రెండో భార్య స్టోరీ వేరేగా ఉంది

రెండో భార్య స్టోరీ వేరేగా ఉంది

రెండో భార్య నేత్రాతో ఎక్కువగా కాలం గడుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ఆమె చేతిలోనే కుక్కచావు చచ్చాడని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వ్యాపారలావాదేవీల కోసం ఫ్రెండ్స్ తో తనను పడుకోమని తన భర్త స్వామిరాజ్ టార్చర్ చేస్తున్నాడని, తాను ఆ పని చెయ్యలేక స్వామిరాజ్ ను చంపేశానని అతని రెండో భార్య నేత్రా మాదనాయకనహళ్ళి పోలీసులకు చెప్పింది.

 ఆస్తి కోసం చంపేసిందని మొదటి భార్య కేసు

ఆస్తి కోసం చంపేసిందని మొదటి భార్య కేసు

స్వామిరాజ్ ఆస్తి మొత్తం లాక్కోవాలని తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేత్రా చంపేసిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి మొదటి భార్య సత్యకుమారి , రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ తండ్రి బసవరాజ్ కలిసి బ్యూటీపార్లల్ లేడీ నేత్రా మీద కేసు పెట్టారు. స్వామిరాజ్ హత్యకు గురైన రోజు మద్యాహ్నం తన ఇంటికి వచ్చాడని, తన రెండో భార్య నేత్రా ఆస్తి మొత్తం తన పేరుతో రాసివ్వాలని టార్చర్ పెడుతోందని తన కొడుకు స్వామిరాజ్ తనకు చెప్పాడని, రేపు నేను వచ్చి మాట్లాడుతాను అని చెప్పి పంపించానని రియల్ ఎస్టేట్ వ్యాపారి తండ్రి బసవరాజ్ పోలీసులకు చెప్పారు.

Recommended Video

గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu
 కిలాడీ లేడీ వెనుక ఎవరైనా ఉన్నారా ?

కిలాడీ లేడీ వెనుక ఎవరైనా ఉన్నారా ?

కోటీశ్వరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ను అతని రెండో భార్య నేత్రా మాత్రమే హత్య చేసిందా ?, ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద మొదటి భార్యకు ద్రోహం చేసి రెండో భార్యతో కోరికలు తీర్చుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమె చేతిలో దారుణ హత్యకు గురికావడం ఐటీ హబ్ బెంగళూరులో కలకలం రేపింది.

English summary
Second wife: A 37-year-old woman allegedly bludgeoned her husband to death at their house in Harokyatanahalli near Bengaluru City. on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X