Secret: కన్నింగ్ డెలవరీ బాయ్స్, ఇడ్లీ సాంబార్ తో పాటు ఏమి డెలవరీ చేస్తున్నారంటే ? !
బెంగళూరు/ఉడిపి: ప్రముఖ సంస్థలో డెలవరీ బాయ్స్ గా ఉద్యోగం చేస్తున్న యువకులు అందరికి ఆహారం డెలవరీ ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు డెలవరీ బాయ్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఫుడ్ తయారు చేసి సరఫరా చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న డెలవరీ బాయ్స్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టారు. ఫుడ్ తో పాటు పనిలో పనిగా గంజాయి కూడా డెలవరీ చేస్తున్నారు. కంపెనీ యూనీఫామ్ వేసుకుని సీక్రేట్ గా గంజాయి డెలవరీ చేస్తూ అడ్డంగా బుక్కైపోవడం కలకలం రేపింది.

డెలవరీబాయ్స్
కర్ణాటకలోని ఉడిపిలో మణిపాల్ లో ప్రముఖ ఫుడ్ తయారు చేసే సంస్థలో డెలవరీ బాయ్స్ గా ఉద్యోగం చేస్తున్న యువకులు అందరికి ఆహారం డెలవరీ ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు డెలవరీ బాయ్స్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఫుడ్ తయారు చేసి సరఫరా చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న డెలవరీ బాయ్స్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టారు.

కేరళ టూ ఉడిపి
కేరళ నుంచి కొందరు గంజాయిని రైళ్లలో ఉడిపి, మణిపాల్ కు పంపిస్తున్నారు. ఉడిపి, మణిపాల్ లో కొందరు ఏంజెంట్ లు గంజాయి సేకరించి దాచిపెడుతున్నారు. ఆహారసంస్థలో డెలవరీబాయ్స్ గా పని చేస్తున్న కొందరితో గంజాయి ఏజెంట్లు డీల్ మాట్లాడుకున్నారు. ఫుడ్ ప్యాకెట్ ల మద్యలో గంజాయి ప్యాకెట్లు పెట్టుకుని డెలవరీ చేస్తున్నారు.

మ్యాటర్ లీక్
ఉడిపిలో గంజాయి విక్రయిస్తున్న వారిని ఇటీవల కాలంలో పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి డీలర్లను అరెస్టు చేస్తున్నా గంజాయి ఎలా సరఫరా అవుతోంది ?, ఎవరు సరఫరా చేస్తున్నారు అని పోలీసులు ఆరా తీశారు. చివరికి ఫుడ్ డెలవరీ బాయ్స్ గంజాయి సరఫరా చేస్తున్నారని వెలుగు చూడటంతో పోలీసులు షాక్ అయ్యారు. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు డెలవరీ బాయ్స్ ను ఉడిపి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications