Actress: నన్ను పీల్చిపిప్చి చేసేశాడు, కోరిక తీరిపోయిందని ఆ వీడియోతో బ్లాక్ మెయిల్, మాజీ మంత్రి దెబ్బ !
చెన్నై/ మలేషియా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను ఐదు సంవత్సరాల పాటు అన్ని రకాలుగా ఉపయోగించుకుని కోరికలు మొత్తం తీర్చుకుని నన్ను పీల్చి పిప్పి చేసేశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఎదురు తిరుగుతున్నాడని మాజీ మంత్రి మీద ప్రముఖ నటి సిటీ పోలీసు కమీషనర్ ఆఫీసులో కేసు పెట్టడం కలకలం రేపింది. అసలే మలేషియాకు చెందిన నటి భలే ఉందని ఆ మాజీ మంత్రి అధికారం అడ్డం పెట్టుకుని ఎంజాయ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తనతో ఐదు సంవత్సరాల పాటు రహస్యంగా కాపురం చేశాడని, తనకు మాజీ మంత్రి మద్యలో A to Z జరిగిపోయాయని మలేషియా నటి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం దూమరం రేపింది. తనకు న్యాయం చెయ్యాలని ఆ నటి సీఎంకు, పోలీసు అధికారులకు మనవి చెయ్యడంతో రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు.

మలేషియా హీరోయిన్
మలేషియాకు చెందిన నటి చాందిని నోమాడ్స్ తో పాటు అనేక సినిమాల్లో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తనను అప్పట్లో మంత్రి పదవిలో ఉన్న మణికందన్ తనతో పరిచయం పెంచుకున్నాడని నటి చాందిని ఆరోపిస్తున్నది. తరువాత అన్నాడీఎంకే నాయకుడు మణికందన్ తనతో చనువుగా ఉండేవాడని నటి చాందిని అంటోంది.

చెన్నైలో సీక్రెట్ కాపురం
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో రహస్యంగా కాపురం పెట్టాడని, ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నామని నటి చాందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల వరకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, భార్య హోదాలో నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనకు తియ్యటి మాటలు చెప్పాడని చాందిని ఆరోపించింది.

సార్..... నన్ను పీల్చి పిప్పి చేసేశాడు...... కోరికలు తీరిపోయాయని ?
ఎంతకాలం తాను సీక్రెట్ గా నీతో కాపురం చెయ్యాలి, అందరికి తెలిసేలా నన్ను పెళ్లి చేసుకుని భార్యగా చూసుకోవాలని తాను మణికందన్ కు చెప్పానని, పెళ్లికి మాత్రం ఆయన నో చెబుతున్నాడని నటి చాందిని ఆరోపించింది. ఐదు సంవత్సరాలు తనతో ఎంజాయ్ చేసి నన్ను పీల్చి పిప్పి చేసేశాడని, తన మీద మోజు తీరిపోయిన తరువాత తనను పెళ్లి చేసుకోనని మణికందన్ ఎదురు తిరిగాడని ఆరోపిస్తూ శుక్రవారం నటి చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

బ్లాక్ మెయిల్, చంపేస్తానని వార్నింగ్ ?
నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన మణికందన్ కు తాను ఎదురు తిరిగానని తనను చంపేస్తానని ఆయన కిరాయి రౌడీలతో బెదరిస్తున్నాడని నటి చాందిని ఆరోపిస్తోంది. నువ్వు పోలీసు కేసు పెడితే ఇంతకాలం రహస్యంగా బెడ్ రూమ్ లో తీసుకున్న నీ అశ్లీల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ నటి చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేసింది.

అమ్మ అశీర్వాదంతో మంత్రి పదవి
జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మణికందన్ తమిళనాడు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రిగా పని చేశారు. రమాథపురం ఎమ్మెల్యేగా విజయం సాధించి జయలలిత క్యాబినెట్ లో మంత్రి పదవి సంపాధించుకున్న మణికందన్ తరువాత వీకే. శశికళ టీమ్ లోకి జంప్ అయ్యి చిన్నమ్మ అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

బ్యాడ్ టైమ్ తో సినిమా కష్టాలు
అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగబాటు చేసిన టీటీవీ దినకరన్ కు మద్దతుగా నిలబడిన 18 మంది ఎమ్మెల్యేల్లో మణికందన్ కూడా ఒకరు. ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయిన తరువాత మణికందన్ ను మంత్రి పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి మణికందన్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో మణికందన్ కు బ్యాడ్ టైమ్ మొదలైయ్యింది.

హీరోయిన్ దెబ్బతో పంచె ఊడిపోతుందా ?
మాజీ మంత్రి మణికందన్ మీద కఠిన చర్యలు తీసుకుని ఆయన్ను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ హీరోయిన్ చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసింది. మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
Recommended Video

అయ్యో పాపం.......చాందిని ఎఫెక్ట్
తమిళనాడులో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మణికందన్ కు కచ్చితంగా సినిమా కష్టాలు ఎదురౌతాయని సమాచారం. మొత్తం మీద మాజీ మంత్రి మణికందన్, హీరోయిన్ సీక్రెట్ లవ్ స్టోరీ, చాందిని మేడమ్ మాజీ మంత్రి మణికందన్ సహజీవనం వ్యవహారం బయటకు రావడంతో తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications