అదిరిపోయే శుభవార్త: ఆడపిల్లల భవిష్యత్ బంగారం,లక్షల డబ్బులు ఖాయం!
సుకన్య సమృద్ధి యోజన పథకం.. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం అందిస్తున్న పథకం. ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల చదువు, పెళ్లి ఖర్చులకోసం చిన్నప్పటి నుంచి పొదుపు చేస్తే, పెళ్లీడుకు వచ్చేసరికి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించే పథకం సుకన్య సమృద్ధి యోజన.
ఆడ బిడ్డల కోసం సేవింగ్స్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా
తాజాగా ఈ పథకంలో ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం పొదుపుచేసే తల్లిదండ్రులకు మరో శుభవార్త చెబుతోంది పిఎన్బి మెడ్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
సుకన్య సమృద్ధి యోజన పథకంతో లింక్ చేసి ఆడపిల్లల తల్లిదండ్రులకు లైఫ్ ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ ని అందిస్తోంది. ఆడపిల్లలకు దీర్ఘకాల ఆర్థికప్రయోజనాలను అందించడం కోసం చేపట్టిన ఈ పథకంలో తల్లిదండ్రులకు సేవింగ్స్ తో పాటుగా, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తోంది.

ఏదైనా రిస్క్ అయినా సరే మీ చిన్నారుల భవిష్యత్ కు భరోసా
ఈ ఇన్సూరెన్స్ ఎటువంటి ఆందోళన లేకుండా పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ప్లాన్ చేసుకునేలా చేస్తుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో తల్లిదండ్రులు 250 రూపాయల నుంచి లక్షన్నర వరకు పొదుపు చేయవచ్చు. అయితే ఈ సేవింగ్స్ తో పాటు ప్రొటెక్షన్ తీసుకున్నవారు ఈ స్కీమ్ డబ్బులు కడుతూ మధ్యలో అకస్మాత్తుగా మరణిస్తే స్కీం ఆగిపోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది.
ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 విధానానికి మద్దతుగా ఈ పాలసీ
తల్లి లేదా తండ్రి లేనప్పుడు pnb మెట్ లైఫ్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ప్రతి సంవత్సరం చేసే డిపాజిట్ను చేసే బాధ్యత తీసుకుంటుంది. చదువు పెళ్లి మరియు ఇతర అవసరాలకు ఇబ్బంది పడకుండా బాలికకు రక్షణ కల్పిస్తుంది. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అనే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం కి ఇది తోడ్పాటును అందిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన స్కీంతో పాటు ఈ ఇన్సూరెన్స్ కూడా
ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలనుకునే పేరెంట్స్ 25 వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల మధ్య కాంట్రిబ్యూషన్ అమౌంట్ ను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి సంవత్సరం సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలిక ఖాతా కి కాంట్రిబ్యూషన్ చేస్తుంది.
ఎలాంటి మెడికల్ టెస్ట్ లు లేకుండా ఇన్సూరెన్స్
ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఐదు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు ఫ్లెక్సిబుల్ రూల్స్ కవరేజ్ ఆఫర్ తో ఉంటుంది. ఈ స్కీం కి ఎటువంటి మెడికల్ టెస్ట్ లు అవసరం లేదు. ఇక మరెందుకు కాలుష్యం మీ చిన్నారి భవిష్యత్తు తో పాటు, మీ లైఫ్ కి ఇన్సూరెన్స్ కూడా అందించే ఈ పథకాన్ని అసలు మిస్ చేసుకోకండి.












Click it and Unblock the Notifications