మీ ఫాస్టాగ్ డేంజర్ లో పడింది..!!
ఫాస్టాగ్ పై జాతీయ రహదారుల సంస్థ తాజా ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లోకల్ నెలవారీ పాస్, వార్షిక పాస్ ల లభ్యత, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రదర్శించాలని సూచించింది. ఫాస్టాగ్ పాసుల విషయంలో వాహనదారులకు అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల పారదర్శకంగా వాటిని జారీ చేసినట్టవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఫీల్డ్ కార్యాలయాలన్నింటికీ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య వాహనదారులందరికీ మరో తాజా ఉత్తర్వులు ఇచ్చింది జాతీయ రహదారుల సంస్థ. "నో యువర్ వెహికల్" (KYV) విధానం తప్పనిసరి. ఎన్‌హెచ్‌ఏఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీన్ని అమలు చేయనున్నాయి. FASTag వినియోగదారులు తమ వాహనానికి సంబంధించిన ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిజిటల్ కాపీని అప్‌లోడ్ చేయాలి. దీని ద్వారా ఫాస్టాగ్ సరైన వాహనంతో అనుసంధానమైందా లేదా అనేది తేలిపోతుంది.

ఫాస్టాగ్ ఎవరి పేరు మీద జారీ అయింది, దీన్ని ఎవరు వాడుతున్నారు, ఒకే నంబర్ మీద ఎన్ని ఫాస్టాగ్స్ మంజూరు అయ్యాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది, బ్లాక్ అయ్యాయా, యాక్టివ్ గా ఉన్నాయా, ఒక వాహనానికి ఎన్ని ఫాస్టాగ్ నంబర్లు ఉన్నాయి.. అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ కేవైవీ విధానాన్ని అనుసరిస్తోంది ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కేవైవీ నిబంధన ప్రకారం.. అన్ని వాహన యజమానులు తమ వాహనం చిత్రం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
కేవైసీ మాదిరిగానే, కేవైవీ కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాలి. వాహనదారులు తమ వాహనం ఆర్‌సీ ముందు భాగం ఫొటో, ఫాస్టాగ్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, వాహనం పక్క భాగం నుండి యాక్సెల్ సంఖ్యను చూపే చిత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. ఫాస్టాగ్ జారీ చేసేవారు ఈ వివరాలను వాహన్ డేటాబేస్‌తో ధృవీకరించాలి. ఫాస్టాగ్ మోసాలు పెరిగిపోవడంతో కేవైవీ అవసరం ఏర్పడిందని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది.
కార్ల కోసం ఉద్దేశించిన ట్యాగ్‌లను ట్రక్కు డ్రైవర్లు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఒకే ట్యాగ్‌ను వేర్వేరు వాహనాల్లో ఉపయోగించడం లేదా తప్పుడు వివరాలతో FASTag పొందడం వంటివి జరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి KYV వ్యవస్థను తెర మీదికి తీసుకొచ్చారు. చెల్లుబాటు అయ్యే కేవైవీ లేని ఫాస్టాగ్‌లు ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతాయి కూడా. అప్పుడు కొత్త ఫాస్టాగ్ ను తీసుకోవడానికి మళ్లీ వాహనదారులు.. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా మొదటి నుంచి ఆరంభించాలి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications