ఎటిఎం ల వద్ద క్యూలో నిలడడం లేదు, డబ్బులు డ్రా చేసుకొంటున్నారు.

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై : ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది, శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే సామెతలు గుర్తుండే ఉంటాయి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనేది, దేశ వ్యాప్తంగా పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన కారణంగా కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే డబ్బుల కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే పని లేకుండా ఎటిఎం ల నుండి డబ్బులు డ్రా చేసుకొంటున్నారు.

పెద్ద నగదునోట్ల రద్దుతో కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుండి , ఎటిఎం లనుండి వారానికి 24 వేల రూపాయాల నగదును డ్రా చేసుకొనే అవకాశం కల్పించింది. అయితే ఎటిఎంల నుండి డబ్బులను డ్రా చేసుకొనేందుకు కేవలం రెండువేల రూపాయాలను మాత్రమే డ్రా చేసుకొనే అవకాశం ఉంది.
డబ్బులను డ్రా చేసుకొనేందుకు పనులు మానుకొని గంటల తరబడి ఎటిఎం ల వద్ద నిలబడాల్సిన అవసరం లేకుుండా చెన్నై వాసులు మంచి ఉపాయాన్ని కనిపెట్టారు. ఎటిఎంలలో ఎప్పుడు డబ్బులు పెడతారో తెలియదు. డబ్బులు పెట్టే సమయానికి పనులు వదులుకొని ఎటిఎం లవద్దకు వెళ్ళి డబ్బులు తీసుకొనే అవకాశం లేదు.

 security guards withdraw money from atm with comission

అయితే ఎటిఎంల వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డులకు కొంత కమీషన్ ఇచ్చి డబ్బులను డ్రా చేసుకొంటున్నారు చెన్నై వాసులు. ప్రతి రోజూ ఎటిఎం ల నుండి రెండు వేల రూపాయాలను మాత్రమే డ్రా చేసుకొనే అవకాశం ఉంది. అయితే డబ్బులు కావాల్సిన వారు తమ ఎటిఎం కార్డులను, పిన్ నెంబర్లను సెక్యూరిటీ గార్డుకు ఇస్తున్నారు. ఎటిఎంలలో డబ్బులు డిపాజిట్ చేసిన వెంటనే సెక్యూరిటీ గార్డులు ఆయా కార్డులు, పిన్ ల ఆధారంగా డబ్బులు డ్రా చేస్తున్నారు.

ఎటిఎం లలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు మోసం చేసే అవకాశం కూడ లేదు. ప్రతి రోజు 2 వేల కంటే ఎక్కువ నగదు ఎటిఎం ల నుండి డ్రా చేసుకొనే అవకాశం లేదు. ఎవరి ఖాతాలో ఎంత నగదున్నా సరే రెండువేలకు మించి డబ్బులు రావు.సెక్యూరిటీ గార్డులకు కొంత కమీషన్ కూడ రానుంది. ఈ ఉపాయం ఇద్దరికి ఉపయోగపడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
currency ban effect on people.some people agreement with security guards, consumers give to atm cards and pin numbers to atm security guards.when deposit cash in atm machines, security guards draw with atm cards, some comission give consumers to security guard.
Please Wait while comments are loading...