వారెంట్ జారీ: జులై 6న నిత్యానంతకు పురుషత్వ పరీక్ష

ఇది ఇలా ఉండగా, ఆగస్టు 6న నిత్యానందను అదుపులోకి తీసుకుని పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు. దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు పురుషత్వ పరీక్షలపై స్టే విధించింది.
ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం నిత్యానందపై ఉన్న అన్ని కేసులను విచారించిన హైకోర్టు స్టేను ఎత్తి వేసింది. వెంటనే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో నిత్యానంద తరఫు లాయర్ వాదిస్తూ నిత్యానంద లొంగిపోవడానికి వారం రోజుల గడువు ఇవ్వాలని, అప్పట్లోగా లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని కోర్టును కోరారు. అయితే, ఈ అప్పీల్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో, నిత్యానంద అరెస్టుకు రంగం సిద్ధమైంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications