కేంద్ర మాజీమంత్రి కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్నారు. ఈ తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

సురేష్ కల్మాడి స్వరాష్ట్రం.. మహారాష్ట్రలోని పుణే. మూడుసార్లు పూణే నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1996, 2004, 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. రైల్వే సహాయ మంత్రిగా చిరస్మరణీయ సేవలను అందించారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాజకీయ, క్రీడా రంగాలలో కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లో సుదీర్ఘకాలం పాటు సేవలను అందించారు.

Senior Congress leader and former Union minister Suresh Kalmadi passed away in Pune

సురేష్ కల్మాడి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి పుణెలోని ఆయన నివాసానికి తరలించారు. పార్టీ నాయకులు, ఆయన అభిమానుల సందర్శనార్థం ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. అనంతరం నవీపేట్‌లోని వైకుంఠ స్మశానవాటికలో మధ్యాహ్నం 3:30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. సురేష్ కల్మాడీ మరణం పట్ల సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+