సెప్టెంబర్ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్న సీరమ్ ఇనిస్టిట్యూట్
న్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సెప్టెంబర్ నెల నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) మంగళవారం తెలిపింది. తొలి బ్యాచ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది.
ఒక ఏడాదిలో 300 మిలియన్లకుపైగా డోసులను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. 'సాంకేతిక బదిలీ ప్రక్రియలో భాగంగా, ఎస్ఐఐ.. ఇప్పటికే గమలేయ కేంద్రం నుంచి సెల్, వెక్టర్ నమూనాలను అందుకుంది. వారి దిగుమతిని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదించడంతో, ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైందని ఆర్డిఐఎఫ్ తెలిపింది. కాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా ఉత్పత్తి చేయనుంది.

రష్యాలోని గమలేయా ఇనిస్టిట్యూట్ సహకారంతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇప్పటికే దాదాపు 67 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. మనదేశంలోనూ అనుమతి పొందిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా పంపిణీ జరుగుతోంది. తాజాగా, మరో 50 నగరాల్లో ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, మిర్యాలగూడ, విశాఖపట్నం, విజయవాడలో అందుబాటు ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన ఈ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లను తటస్ఠీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆల్ఫా, బీటా, గామాతో పాటు అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించడంలో స్పుత్నిక్ వీ మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్ తెలిపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications