Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంచు కొండల్లో మైమరిపించే 'ఇగ్లూ విలేజ్'.. ఎలా చేరుకోవాలి..?

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఇక్కడ వింటర్ సీజన్ లో ఎటు చూసినా శ్వేత వర్ణంతో నిండిపోయి ఉంటుంది. ఈ రాష్ట్రంలోని చాలా గ్రామాలు మంచు దుప్పటితో కప్పేసినట్లుగా ఉంటాయి. అందుకే టూరిస్టులు జనవరి, ఫిబ్రవరి సీజన్ లో ఈ గ్రామాలను సందర్శించేందుకు ఇష్టపడుతుంటారు. ఈ గ్రామాల్లో ఇగ్లూ ఆకారపు ఇళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. చుట్టూ తెల్లని మంచు కొండలు.. పైనుంచి సన్నగా మంచు వర్షం పడుతుంటే.. ఇక్కడి ఇగ్లూ కేఫ్స్ లో హాట్ హాట్ టీ, కాఫీతో పాటు ఇక్కడి సంప్రదాయ వంటకాలు తింటుంటే ఆ అనుభూతే వేరు అని టూరిస్టులు చెబుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని అనేక గ్రామాలు ఈ సీజన్ లో మంచుతో కప్పబడి ఉంటాయి. అయితే హిమాచల్ ని సేథన్ గ్రామం ఇప్పుడు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గ్రామానికి సాహస యాత్రికుల నుండి ప్రకృతి ప్రేమికుల వరకు అందరూ తరలివస్తున్నారు. ఎందుకంటే ఈ సేథన్ గ్రామం ఇప్పుడు 'ఇగ్లూ విలేజ్' గా మారిపోయింది. దాంతో ఈ ఇగ్లూ విలేజ్ విశేషాలను తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ గ్రామం.. హిమాచల్ లోని కులు లోయలో, సముద్ర మట్టానికి సుమారు 2,700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే ఈ గ్రామం మనాలికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చిన్న గ్రామం ఇప్పుడు దేశంలోనే తొలి ఇగ్లూ విలేజ్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది. దాంతో టూరిస్టులు ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. విదేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఇగ్లూ ఇళ్లు ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి రావడంతో టూరిస్టులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Sethan India s First Igloo Village in himachal Where Tourists Queue for a Magical Snowy Stay

ఇక ఇగ్లూ ఇళ్ల ప్రత్యేకత ఏంటంటే..? బయట గడ్డకట్టేంత చలి ఉన్నా ఇగ్లూ లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. బయట మైనస్ డిగ్రీల్లో చలి ఉన్నప్పటికీ.. ఇగ్లూ లోపల మాత్రం బయటి కంటే దాదాపు 8 నుంచి 10 డిగ్రీల వరకు ఎక్కువ వేడి ఉంటుంది. మంచు గోడలు బయటి గాలిని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడమే దీనికి మూల కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఇక సేథన్ గ్రామంలో ఇగ్లూ బస మాత్రమే కాదు.. గుర్రపు స్వారీ, ట్రెక్కింగ్​, స్కీయింగ్ , స్నోబోర్డింగ్ తదితర క్రీడలు అందుబాటులో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+