హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ మొరాకో మోడల్ కీలకం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇటీవల బయటపడిన హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌లో పోలీసులు మొరాకో మోడల్ కోసం అన్వేషిస్తున్నారు. పిన్ సన్యాల్, అతని అనుచరులు నిర్వహిస్తున్న హై ప్రొఫెల్ సెక్స్ రాకెట్‌లో ఆమె కీలకమైన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.

విచారణలో సన్యాల్ ఆమె గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సన్యాల్‌ను ఆమె తరుచుగా కలుస్తుండేదని, అతని అనుచరుడికి చెందిన ఫామ్ హౌస్‌కు వెళ్తుండేదని అంటున్నారు. అతిథులకు, మహిళలకు మధ్య ఆమె సమన్వయం కుదిర్చేదని చెబుతున్నారు.

ఓ ఫారినర్‌ను అక్రమంగా నిర్బంధించిన కేసులో పోలీసులు సన్యాల్‌ను అరెస్టు చేశారు. సన్యాల్‌కు తనను కల్నల్ అజయ్ అహ్లావత్ (రిటైర్డ్) పరిచయం చేశాడని 23 ఏళ్ల విదేశీ బాధితురాలు చెప్పింది. అయితే ఇప్పటి వరకు అహ్లావత్‌ను అరెస్టు చేయలేదు.

Sex racket: Moroccan model on police radar, was a key figure

ఇతర విదేశీ మహిళలకు సంబంధించిన పాస్‌పోర్టు కాపీలను సన్యాల్ నివాసంలో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. మధ్యాసియాకు చెందిన విదేశీయుల ఫోన్ నెంబర్లు కూడా పోలీసులకు లభించాయి. ఎస్పీ పార్లమెంటు సభ్యుదు నరేష్ అగర్వాల్, బిజెపి ఎంపి జగదాంబిక లెటర్ హెడ్స్, సీల్స్ సన్యాల్ నివాసంలో లభించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, రాజకీయ నాయకులు ఈ కేసుతో సంబంధం లేదని జాయింట్ సిపి ఆర్పీ ఉపాధ్యాయ, డిసిపి ఈశ్వర్ సింగ్ చెప్పారు. పిఎంఓతో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని సన్యాల్ చెబుతుండేవాడని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The probe into the alleged sex racket has led the police on the trail of a Moroccan model. She's supposedly a key figure in the ring run by P N Sanyal and his associates.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి