Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నటిపై లైంగిక దాడి: ఎఫ్ఐఆర్ మేరకు ఇలా జరిగింది...

మలయాళీ నటిపై లైంగిక దాడి కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ రూపొందించారు. అందులో వారు సంఘటన తీరుతెన్నులను వివరించారు ఇలా...

కొచ్చి: కదులుతున్న కారులో మలయాళీ నటిపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్‌ను రూపొందించారు. నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసుపై పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో ఏం చెప్పారనేది కీలకంగా మారింది. ఎఫ్ఐఆర్‌ను ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఆ ఎప్ఐఆర్ ప్రకారం సంఘటనల పరంపర ఇలా కొనసాగింది.

త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్ ముగించుకుని నటి సాయంత్రం ఏడు గంటలకు ఎస్‌యువీలో బయలుదేరింది. ఆ ఎస్‌యూవిని ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ లాల్ క్రియేషన్స్ సమకూర్చింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లో గల తన స్నేహితురాలి ఇంటికి నటి బయలుదేరింది.

ఆమె ప్రయాణిస్తున్న సమయంలోనే కారు డ్రైవర్ మార్టిన్ కొందరికి ఎస్ఎంఎస్‌లు పంపించాడు. మార్టిన్ ఇచ్చిన సమాచారంతో పల్సర్ సునీ ముఠా క్యాటరింగ్ వ్యాన్‌లో ఆమెను వెంటాడింది. ఉద్దేశ్యపూర్వకంగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నెదుంబరసరీ ఎయిర్‌పోర్టు జంక్షన్‌లో ఆమె వాహనాన్ని ఆ కిరాయి ముఠా ఆమె వ్యాన్‌ను ఢీకొట్టింది. దాంతో ఎస్‌యువీ వాహనం ఆగిపోయింది.

వారిద్దరు ఇలా చొరబడ్డారు..

వారిద్దరు ఇలా చొరబడ్డారు..

కారు ఆగగానే ఇద్దరు నిందితులు (ఎ-2, ఎ-3) ఆమె కారులోకి చొరబడ్డారు. తన చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయవద్దని బెదిరించారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. ఆ కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఎ-3 నిందితుడు (అతని పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు.

అతను దిగిపోయాడు.. మరొకతను ఎక్కాడు..

అతను దిగిపోయాడు.. మరొకతను ఎక్కాడు..

నల్ల టీ షర్టు ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. బలవంతంగా నటి నోరు మూసి వారు ముందుకు కదిలారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులు కారులోకి వచ్చారు. వారు రూట్ మార్చి వాహనాన్ని ఓఇంటి ముందు ఆపారు.

రంగంలోకి వచ్చిన పల్సర్ సునీ...

రంగంలోకి వచ్చిన పల్సర్ సునీ...

ఇక్కడ పల్సర్ సునీ అలియాస్ సునీల్ కుమార్ రంగంలోకి దిగాడు. ముఖానికి టవల్ చుట్టుకుని వచ్చిన అతను డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. అప్పటి వరకు వాహనాన్ని నడిపిన మార్టిన్ గ్యాంగులోని మిగతా వారితో కలిసి క్యాటరింగ్ వ్యాన్ ఎక్కాడు. పల్సర్ సునీ అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకుని వెళ్లి ఆమెను లైంగికంగా వేధించాడు.

థర్డ్ పార్టీ తరఫున వచ్చానని...

థర్డ్ పార్టీ తరఫున వచ్చానని...

అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీసేందుకు థర్డ్ పార్టీ తరఫున తాను వచ్చానని, నతకు సహకరించాలని నటితో చెప్పాడు. కాసేపు నటిని అసభ్యంగా చిత్రీకరించిన తర్వాత ఆమెను కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు గెంటేశాడు. దాదాపు రెండున్నర గంటల పాటు అమానవీయంగా వ్యవహరించాడు.

నటి దర్శకుడు లాల్ ఇంటికి...

నటి దర్శకుడు లాల్ ఇంటికి...

నటి అక్కడి నుంచి నేరుగా తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్న లాల్ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటపెడుతానని పల్సర్ సునీ హెచ్చరించినట్లు నటి తెలిపింది.

డ్రగ్ ఇంజెక్టు చేస్తానని బెదిరింపులు..

డ్రగ్ ఇంజెక్టు చేస్తానని బెదిరింపులు..

తనకు సహకరించకపోతే డ్రగ్స్ ఇంజెక్టు చేసి మరింత వేధిస్తానని సునీ బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సినీ పరిశ్రమలోని వ్యక్తిగత క్షకలను తీర్చుకోవడానికే హీరోయిన్‌పై కిరాయి ముఠాతో ఈ దారుణం చేయించారని, సినిమా వాళ్ల తరఫున సునీ ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే పిటి థామస్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+