I Love You: ఫించను తీసుకునే 66 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయికి లవ్ లెటర్, తరువాత..... !

చెన్నై/ కోయంబత్తూరు: ఫించన్ తీసుకునే 66 ఏళ్ల వయసులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఫించన్ కోసం అర్జీ ఇస్తున్నాను అనుకున్నాడో ఏమో అతని ఇంటికి మనువరాళ్లతో ఆడుకోవడానికి వచ్చిన 16 ఏళ్ల బాలికకు లవ్ లెటర్ ఇచ్చాడు. I like You, I love U, I Kiss You, నువ్వు అంటే నాకేంతో ఇష్టం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నీకు సమాచారం ఇస్తా, నా దగ్గరకు వచ్చేయ్, ఇద్దరూ ఎంజాయ్ చేద్దాం అంటూ మనువరాలి ఫ్రెండ్ కు 66 ఏళ్ల తాత లవ్ లేటర్ ఇచ్చాడు. ఈ విషయం అమ్మాయి తల్లికి తెలిసింది. అంతే కాటికి కాలు చాపే వయసులో వీడికి ఇదేం పోయేకాలం, వీడిని ఇలాగే వదిలేస్తే పరిసర ప్రాంతాల్లోని అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయని భయపడిన అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొడుకులు, కూతుర్లకు వివాహాలు

కొడుకులు, కూతుర్లకు వివాహాలు

తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లోని ఫోథానూర్ సమీపంలోని బాబాజీ మసీదు సమీపంలో మహమ్మద్ పీర్ పాష (66) అనే వృద్దుడు నివాసం ఉంటున్నాడు. మహమ్మద్ పీర్ పాషాకు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కుమార్తెలు, కుమారులకు పెళ్లిళ్లు అయిపోవడంతో వారు మహమ్మద్ పీర్ పాషా నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లోనే వాళ్లు నివాసం ఉంటున్నారు.

66 ఏళ్ల యంగ్ బాయ్ అనే ఫీలింగ్

66 ఏళ్ల యంగ్ బాయ్ అనే ఫీలింగ్

66 ఏళ్ల వయసు వచ్చినా మహమ్మద్ పీర్ పాషా తాను ఓ యంగ్ బాయ్ అనే ఫీలింగ్ తో బతికేస్తున్నాడు. మహమ్మద్ పీర్ పాషా ఇంటిలోనే ఓ కొడుకు, అతని భార్య, పిల్లలు నివాసం ఉంటున్నారు. మమహ్మద్ పీర్ పాషా మనుమళ్లు, మనుమరాళ్లు లాక్ డౌన్ సందర్బంగా స్కూల్స్ మూసివేయడంతో వారు తాత ఇంటి దగ్గరకు వెళ్లి ఆడుకుంటున్నారు.

మనుమరాలి ఫ్రెండ్ మీద తాత కన్ను

మనుమరాలి ఫ్రెండ్ మీద తాత కన్ను

మనుమరాలితో కలిసి ఆడుకోవడానికి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలిక మహమ్మద్ పీర్ పాషా ఇంటికి వచ్చి వెలుతోంది. ఆ సమయంలో 16 ఏళ్ల బాలిక మీద కామాంధుడు మహమ్మద్ పీర్ పాషా కన్ను పడింది. మనుమరాలి ఫ్రెండ్ తో మాట్లాడే ముసుగులో అమ్మాయి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వెయ్యడం, అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు.

 ఫించను తీసుకునే వయసులో లవ్ లెటర్

ఫించను తీసుకునే వయసులో లవ్ లెటర్

మమహ్మద్ పీర్ పాషా మనుమరాలిని కావాలని వెంట పెట్టుకుని అప్పుడప్పుడు 16 ఏళ్ల అమ్మాయి ఇంటికి వెళ్లి పలకరించేవాడు. మహమ్మద్ పీర్ పాషా మనుమరాలు, ఆ ఇంటి అమ్మాయి ఫ్రెండ్స్ కావడంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో 60 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వాలు వృద్ధాప్య ఫించన్లు ఇస్తున్నారు. పించను తీసుకునే వయసులో మహమ్మద్ పీర్ పాషాకు మనుమరాలి ఫ్రెండ్ కు లవ్ లెటర్ ఇవ్వాలని అనిపించింది. అంతే మహమ్మద్ పీర్ పాషాకు పోయేకాలం దగ్గరకు వచ్చి ఓ లవ్ లెటర్ రాశాడు.

I Love You బంగారం

I Love You బంగారం


I like You, I love U, I Kiss You, నువ్వు అంటే నాకేంతో ఇష్టం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నీకు సమాచారం ఇస్తా, నా దగ్గరకు వచ్చేయ్, ఎంజాయ్ చేద్దాం అంటూ మనువరాలి ఫ్రెండ్ అయిన 16 ఏళ్ల అమ్మాయికి కామాంధుడు మహమ్మద్ పీర్ పాషా లవ్ లెటర్ ఇచ్చాడు. తాత ఇచ్చిన లవ్ లెటర్ చూసిన అమ్మాయి షాక్ కు గురైయ్యింది.

Recommended Video

    #ViralVideo : అరుదైన వ్యాధి తో బాధ పడుతున్న బామ్మ || Oneindia Telugu
    లవ్ లెటర్ తరువాత ఏం జరిగిందంటే ?

    లవ్ లెటర్ తరువాత ఏం జరిగిందంటే ?


    తాతా నువ్వు చేసిన పని ఏమీ భాగాలేదని 16 ఏళ్ల బాలిక మహమ్మద్ పీర్ పాషాపై మండిపడింది. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తానని మహమ్మద్ పీర్ పాషా బాలికను బెదిరించాడు. అయితే లవ్ లెటర్ తీసుకెళ్లి ఆ బాలిక నేరుగా ఆమె తల్లికి ఇచ్చింది. ఒక్కరోజు ఆలోచించిన బాలిక తల్లి మహమ్మద్ పీర్ పాషాను ఇలాగే వదిలేస్తే ఈ పరిసర ప్రాంతాల్లోని అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తాడని ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మహమ్మద్ పీర్ పాషాకు బెండ్ తీశారు. 16 ఏళ్ల బాలికకు తానే లవ్ లెటర్ రాశానని మహమ్మద్ పీర్ షాషా అంగీకరించడంతో అతన్ని కోవై సెంట్రల్ జైలుకు తరలించామని కోయంబత్తూరు పోలీసు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+