ఆ శృంగారం 'రేప్' కాదు..: బాంబే హైకోర్టు ఆసక్తికర తీర్పు

పనాజీ: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ యువకుడిపై నమోదైన అత్యాచారం కేసును తోసిపుచ్చుతూ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళ్తే.. యోగేష్ పాలెకర్ అనే యువకుడు కేసినోలో పనిచేస్తుంటాడు. అక్కడే అతనికి ఓ యువతి పరిచయమైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఓరోజు యోగేష్ తన కుటుం సభ్యులకు ఆమెను పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ సమయంలో యోగేష్ ఇంట్లో ఎవరూ లేరు. ఆ రాత్రి యువతి కూడా అక్కడే ఉండిపోగా.. ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. మరుసటిరోజు ఉదయం ఆమెను అతను ఇంటి వద్ద దిగబెట్టి వచ్చాడు. ఆ తర్వాత పలుమార్లు అతని ఇంట్లోనే ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు.

Sexual relations due to deep love not rape, Bombay High Court says

అయితే ఆ యువతి తనను వివాహం చేసుకోవాలని కోరగా.. తక్కువ కులం కారణంగా అతను నిరాకరించాడు. దీంతో యోగేష్ పాలేకర్ పై ఆమె రేప్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాబట్టే యోగేష్‌తో శృంగారానికి ఒప్పుకున్నానని, కానీ అతను మాత్రం మాట మార్చాడని కేసు పెట్టింది.

కేసును విచారించిన కోర్టు యోగేష్ కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యోగేష్.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. యోగేష్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సీవి భదంగ్ అతనికి అనుకూలంగా తీర్పునిచ్చారు.

గాఢమైన ప్రేమలో ఉన్న ఇద్దరు ప్రేమికులు పరస్పరం ఆమోదంతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం అత్యాచారంగా పరిగణించలేమని న్యాయమూర్తి వెల్లడించారు. కేవలం పాలేకర్ ఇచ్చిన మాట వల్లే వీరిద్దరి మధ్య శృంగారం జరగలేదని, ఇద్దరు పరస్పర ఆమోదంతోనే అందులో పాల్గొన్నారని తెలిపారు. పైగా పాలేకర్ ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేశాడని చెప్పారు.

అయితే ఆర్థిక సహాయం చేసినంత మాత్రానా.. అతను ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాడని, రేప్ చేశాడు అని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అతనికి విధించిన శిక్షను కూడా న్యాయమూర్తి కొట్టివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+