షబానా అజ్మీ డ్రైవర్ కేసు నమోదు, రోడ్డు ప్రమాదంపై ఎఫ్ఐఆర్, కేసు ఎవరు పెట్టారంటే..?
ప్రముఖ నటి షబానా అజ్మీ కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. షబానా అజ్మీ కారు డ్రైవర్‌పైనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అతను ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని అందులో పేర్కొన్నారు. షబానా అజ్మీ డ్రైవర్‌పైనే పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసుపై షబానా అజ్మీ మేనేజర్లు స్పందించాల్సి ఉంది.

తలకు గాయం
శనివారం మధ్యాహ్నాం ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే పై షబానా అజ్మీ కారు ప్రమాదానికి గురైంది. ట్రక్కును ఢీ కోవడంతో షబానా అజ్మీకికి తీవ్ర గాయాలు కాగా.. ఆమె భర్త, లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని సమీపంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అందేరిలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు.

కేర్ లెస్ డ్రైవింగ్..?
షబానా అజ్మీ తలకు గాయమైందని.. వెన్నుముక కూడా గాయమైందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని.. కానీ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కారు ప్రమాదం ఎలా జరిగిందని అనుకొనే సమయంలో పోలీసులు షబానా అజ్మీ కారు డ్రైవర్ అమ్లేష్ యోగేంద్ర కామత్‌పై కేసు రిజిస్టర్ చేశారు.

ట్రక్కు డ్రైవర్ కంప్లైంట్
కారు ప్రమాదంపై ట్రక్కు డ్రైవర్ రాజేశ్ పండురాంగ్ షిండే ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ వే పై వెళ్తుండగా.. షబానా అజ్మీ కారు తన వాహనాన్ని వేగంగా ఢీ కొన్నదని ఫిర్యాదులో తెలిపారు. వేగంగా ట్రక్కును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగిందని వాహన డ్రైవర్ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications