ఎయిర్ పోర్టులో షారుక్ ఖాన్ బాడీగార్డ్ నిలిపివేత.. కారణమిదే..?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బాడీగార్డ్‌ను ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షారుక్ ఖాన్ బాడీ గార్డ్ రవీ సింగ్ శుక్రవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఎయిర్ పోర్టు వద్దకు వచ్చాడు. అయితే అతని లగేజ్‌లో లగ్జరీ వాచ్స్ గల ఖాళీ కవర్స్ కనిపించాయి.
ఎయిర్ పోర్టులో తనిఖీ చేయగా 2 లగ్జరీ వాచ్ కేసులు, 4 ఇతర వాచ్ కవర్స్ కనిపించాయి. దీంతో లగ్జరీ ఉత్పత్తుల సుంకం చెల్లింపునకు సంబంధించి అధికారులు షారుక్ ఖాన్ బాడీగార్డ్‌ను నిలిపివేశారు. అయితే అతను కస్టమ్స్ డ్యూటీ కట్టాలని స్పష్టంచేశారు. దీంతో పే చేయడంతో.. తర్వాత అతనిని పంపించారు.

షారుక్ ఖాన్, అతని మేనేజర్ పూజా దాద్లానీ కూడా దుబాయ్ నుంచి వచ్చారు. వారు 12.30 గంటలకు వెళ్లిపోయారు. కానీ వారిని అధికారులు ఆపలేదు. గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా, అండ్ కల్చరల్ నారేటివ్ అవార్డ్ తీసుకోవడానికి షారుక్ ఖాన్ షార్జా, యుఏఈ వెళ్లారు. తిరిగి వస్తోండగా అతని బాడీ గార్డును ఆపివేశారు. కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత.. పంపించివేశారు.
ఈ ఘటన కాస్త కలకలం రేపింది. ఎందుకంటే దుబాయ్, యూఏఈ నుంచి వస్తే బంగారం పట్టుబడుతుంది. అందుకే కస్టమ్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. షారుక్ బాడీ గార్డ్ కూడా.. లగ్జరీ వాచ్ కొనుగోలు చేసి.. కస్టమ్స్ డ్యూటీ కట్టలేదు. అందుకే అతనిని నిలిపివేశారు.
-
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications