దారుణం: మూడేళ్ల చిన్నారిపై ప్లే స్కూల్ యజమాని రేప్

ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె అత్యాచారానికి గురైందని వెల్లడించారు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు నిందితుడైన స్కూల్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. అతడ్ని చితకబాదారు.
మూడు రోజులపాటు నిందితుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఇతర చిన్నారులు కూడా అతని బారినపడి లైంగిక దాడికి గురయ్యారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. బాధిత చిన్నారి మూడు రోజుల నుంచి వాంతులు చేసుకుంటోందని, ఆమె అనారోగ్యం బారిన పడిందని చెప్పారు. స్కూల్ యజమాని తనపై దాడి చేశాడని బాధిత చిన్నారి తెలిపినట్లు ఆమె అమ్మమ్మ మీడియాకు చెప్పింది.
తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్లే స్కూల్ యజమానిని అరెస్ట్ చేశారు. మిగితా స్కూల్ యాజమాన్యం పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications