నితీశ్ కుమార్‌కు ఝలక్- కాంగ్రెస్‌లోకి శరద్ యాదవ్ కుమార్తె- వెంటనే అసెంబ్లీ సీటు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పోటీ చేసి బీజేపీకి చుక్కలు చూపించిన సీఎం నితీశ్ కుమార్ ఈ ఎన్నికల్లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆయనకు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి మరో ఝలక్ ఇచ్చింది.
2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున గెలిచి సీఎం పీఠాన్ని అందుకున్న నితీశ్ కుమార్, ఆ తర్వాత ఆర్జేడీ-కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపారు. ఆ ఎన్నికలకు ముందు ఎన్డీయేను వీడినట్లు నటించి తిరిగి ఎన్డీయేతో చేరిపోయారు. దీన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత శరద్‌యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు నితీశ్‌కు దెబ్బకు దెబ్బ కొట్టాలని భావిస్తున్న మహాకూటమి నేతలు.. శరద్ యాదవ్ కుమార్తెను తెరపైకి తెచ్చారు. శరద్ కుమార్తె సుభాషిణీ యాదవ్ ఇవాళ మహాకూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తన తండ్రి శరద్ యాదవ్ నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన బీహార్‌లోని మాధేపురా ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే బీహారీగంజ్ నుంచి సుభాషిణీ యాదవ్ పోటీ చేయబోతున్నారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడమే తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా సుభాషిణి వ్యాఖ్యానించారు. తన తండ్రి కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికలంటే కక్షసాధింపు వేదిక కాదని, అభివృద్ధి అజెండాతోనే తాను ముందుకెళ్తానని సుభాషిణి ప్రకటించారు.
Recommended Video
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications