పెళ్లి చేసుకుందాంరా... రాహుల్ గాంధీకి ఆ స్టార్ హీరోయిన్ ఆఫర్..!

నటి షెర్లిన్ చోప్రా ఈ సారి రాజకీయ వార్తల్లో నిలిచారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గా.. మోడల్ గా షర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. షర్లిన్ కామెంట్స్..వ్యవహార శైలి నిత్యం ఏదో విధంగా వార్తల్లో నిలుస్తోంది. షర్లిన్ వీడియోలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. షర్లిన్ చేసే ప్రకటనలు వైరల్ అవ్వటం సర్వ సాధారణం. పలు సందర్భాల్లో షర్లిన్ వివాదాలకు చిరునామాగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ ను పెళ్లి చేసుకుంటానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించి కొంత కాలంగా పలు వార్తలు బయటకు వస్తున్నాయి. జోడో యాత్ర సమయంలోనే రాహుల్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానంటూ.. తన భార్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వివరించారు.

Sherlyn Chopra says ready to marry with Congress leader Rahul Gandhi

కొద్ది రోజుల క్రితం హర్యానాకు చెందిన కొందరు మహిళలు సోనియా నివాసానికి వచ్చారు. ఆ సమయంలోనూ సోనియాతో రాహుల్ పెళ్లి గురించి ప్రస్తావన చేసారు. దీంతో, మంచి సంబంధం చూడాలని సోనియా వారితో పేర్కొనటం వైరల్ గా మారింది. ఇప్పుడు రాహుల్ తో పెళ్లికి సంబంధించి నటి షెర్లిన్ చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా షెర్లిన్‌ చోప్రా ను రాహుల్ ను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే ఓకే చెప్పేసారు. ఎందుకు చేసుకోకూడదని ప్రశ్నించారు. అదే సమయంలో ఒక కండీషన్ పెట్టారు. పెళ్లి తరువాత కూడా తన ఇంటి పేరు చోప్రాగానే ఉండాలంటూ షరతు విధించారు.

ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు సంబంధించి పలు పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతు దారులు షర్లిన్ వ్యాఖ్యల పైన ట్రోల్ చేస్తున్నారు. షర్లిన్ ను పెళ్లి చేసుకొని రాహుల్ తన జీవితాన్ని వృధా చేసుకోరంటూ కామెంట్స్ నెట్టింట దర్శనమిస్తున్నాయి. వివాదాస్పద కామెంట్స్.. ట్రోలింగ్ షెర్లిన్ కు కొత్త కాదు.

గతంలోనూ బిగ్ బాస్ వ్యవహారంలోనూ షెర్లిన్ వివాదాస్పదంగా మారారు. ఇప్పుడు రాహుల్ గాంధీతో పెళ్లి గురించి కామెంట్స్ చేయటంతో రాజకీయంగానూ షెర్లిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో రిలీఫ్ దక్కింది.

లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటుకు కారణమైన సూరత్ కోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో, ఇప్పుడు అనర్హత వేటును లోక్ సభ ఉప సంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. దీని పైన లోక్ సభ సచివాలయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్రంపైన అవిశ్వాసం పై చర్చ సమయంలో రాహుల్ పైన అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+