కాలేజ్ అమ్మాయిల అశ్లీలు ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన స్టూడెంట్ లీడర్ !
బెంగళూరు/శివమొగ్గ: యువతుల సన్నిహిత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను కర్ణాటకలో ఏబీవీపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణ ఏబీవీపీ అధ్యక్షుడిగా పని చేస్తున్న ప్రతీక్ గౌడ అనే యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రతీక్ గౌడ ఓ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు అన్నారు.
ఆ ప్రాంతంలోని కొందరు కళాశాల విద్యార్థినులు, యువతులతో శృంగారంలో పాల్గొన్న ప్రతీక్ గౌడ సీక్రేట్ గా ఫొటోలు, వీడియోలు తీశాడని ఆరోపణలు ఉన్నాయి. తరువాత ప్రతీక్ గౌడ అమ్మాయిల సన్నిహిత ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసి వైరల్ చేస్తున్నాడని ఎన్ఎస్ యూఐ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలు శివమొగ్గ పరిసర ప్రాంతాల్లో వైరల్‌గా మారాయి.

కాంగ్రెస్ పార్టీ అనుభంద విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ ప్రతీక్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతీక్ ప్రైవేట్ వీడియోలను ఉపయోగించి బాలికలు, విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఎన్ఎస్ యూఐ ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో శివమొగ్గ పోలీసులు ప్రతీక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్ టీసీలో ఉచిత ప్రయాణం, పవిత్ర పుణ్యక్రేతంలో లక్ష మంది భక్తులు, దెబ్బకు బస్సుల్లో !

ప్రతీక్ గౌడపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని తీర్థహళ్లి పోలీసులు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎన్ఎస్ యూఐ నాయకులు కలిసి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి మా కార్యకర్తను అరెస్టు చేయించారని, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.













Click it and Unblock the Notifications