Marriage: 20 రోజుల క్రితం పెళ్లి, భార్య బయట, బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ? అక్కడ ఏం జరిగింది ? !
చెన్నై: పెళ్లి వయసుకు వచ్చిన యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇప్పటికే అక్కకు పెళ్లి కావడంతో అతని పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. రోజూ మద్యం సేవిస్తున్న అతనికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి చాలా మంది వెనుకడుగు వేశారు. అయితే వెయ్యి అపద్దాలు చెప్పి ఓ పెళ్లి చెయ్యాలి అని పెద్దలు చెప్పిన సామెత పాటించిన యువకుడి కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో అతని పెళ్లి సెట్ చేశారు. మూడు వారాల క్రితం యువకుడి పెళ్లి జరిగింది. తమ్ముడు, అతని భార్యను భోజనానికి రావాలని పెళ్లి కొడుకు అక్క చెప్పింది. కొత్త పెళ్లికొడుకు అతని భార్యను పిలుచుకుని అతని అక్క ఇంటికి వెళ్లాడు. అక్కడ రచ్చరచ్చ అయ్యింది. భార్యను పిలుచుకుని అక్క ఇంటి నుంచి కోపంగా ఊపుకుంటూ సొంత ఇంటికి వెళ్లిపోయిన కొత్త పెళ్లి కొడుకు గంట తరువాత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

క్యాబ్ డ్రైవర్
చెన్నై సిటీలోని అడంబాక్కంలోని రామక్రిష్ణాపురం, మూడవ వీధిలో విజయన్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పెళ్లి వయసుకు వచ్చిన విజయన్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇప్పటికే విజయన్ అక్కకు పెళ్లి కావడంతో అతని పెళ్లికి అన్ని వైపుల నుంచి లైన్ క్లియర్ అయ్యింది.

వీర తాగుబోతు
సొంతంగా కారు పెట్టుకుని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న విజయన్ విలాసాలకు బానిస అయ్యాడు. రోజూ మద్యం సేవిస్తున్న విజయన్ కు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి చాలా మంది వెనుకడుగు వేశారు. అయితే వెయ్యి అపద్దాలు చెప్పి ఓ పెళ్లి చెయ్యాలి అని పెద్దలు చెప్పిన సామెత పాటించిన విజయన్ కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో అతని పెళ్లి సెట్ చేశారు. 20 రోజుల క్రితం విజయన్ పెళ్లి జరిగింది.

అక్క ఇంట్లో తాగేసి హంగామా చేశాడు
విజయన్, అతని భార్యను భోజనానికి రావాలని పెళ్లి కొడుకు అక్క చెప్పింది. కొత్త పెళ్లికొడుకు విజయన్ అతని భార్యను పిలుచుకుని చెన్నైలోనే నివాసం ఉంటున్న అతని అక్క ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చెయ్యడానికి ముందు బయటకు వెళ్లిన విజయన్ పీకలదాక మద్యం సేవించి అక్క ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విజయన్ బంధువులు, అతని అక్క అత్తారింటి వాళ్లు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో విజయన్ కారణంగా అక్కడ రచ్చరచ్చ అయ్యింది.

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు
అక్కతో గోడవపడిన విజయన్ అతని భార్యను పిలుచుకుని కోపంగా అడంబాక్కంలోని అతని సొంత ఇంటికి వెళ్లిపోయాడు. గంట తరువాత విజయన్ అతని బెడ్ రూమ్ లోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడు. భార్యతో పాటు బంధువులు బయటకు రావాలని చెప్పినా విజయన్ మాత్రం మాట వినలేదు.

హడలిపోయిన కొత్త పెళ్లి కూతురు
బంధువులు తలుపులు పలగొట్టి చూడగా విజయన్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అక్కతో పాటు ఆమె కుటుంబ సభ్యులు మందలించారని కోపంతో మద్యం మత్తులో ఉన్న విజయన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగిన 20 రోజులకే భర్త విజయన్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య షాక్ అయ్యింది.












Click it and Unblock the Notifications