యూఎస్ లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్!

యూఎస్ లో చదువుతున్న విద్యార్థులకు షాకింగ్ వార్త. సాధారణంగా యుఎస్ లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు చదువుతో పాటు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి షాక్ ఇస్తోంది యుఎస్ ప్రభుత్వం. తాజాగా ఎఫ్ 1 వీసా మీద ఉన్న ఇద్దరు విద్యార్థులను ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న కారణంగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు.

పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన భారతీయ విద్యార్థులకు తాజా పరిణామం ఒక షాక్ గా మారింది. మిన్నెసోటా రాష్ట్రం సెయింట్ లూయిస్ పార్క్ లో వీసా నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన వారు, అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించారు.

shock for indian students two Students Arrested in USA for FI Visa Violation by doing part time job

అనధికారికంగా రెస్టారెంట్లో పనిచేస్తున్న కారణంగా అరెస్ట్
అయితే అక్కడ పనిచేస్తున్న వారిలో స్టూడెంట్ వీసా మీద ఉన్న ఇద్దరు విద్యార్థులు ఉండడంతో వారు f1 వీసా నిబంధనలను ఉల్లంఘించారని రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారని అభియోగంతో అరెస్టు చేశారు. అనధికారికంగా రెస్టారెంట్లో పనిచేస్తున్న కారణంగా వారిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు. యూఎస్ లో ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల పైన వరుస అణచివేతలు కొనసాగుతున్నాయి.

భారతీయ విద్యార్థులకు అలెర్ట్
భారతీయ విద్యార్థులను ఏవిధంగా డిపోర్ట్ చెయ్యాలి అన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఏ చిన్న అవకాశం దొరికినా విద్యార్థుల పైన విరుచుకుపడుతున్నారు. ఇక తాజా పరిణామాల క్రమంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బుల కోసం అనధికారికంగా పనిచేస్తే, వీసా నిబంధనల ప్రకారం వీసా రద్దయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

చదువు పూర్తి కాకుండా పార్ట్ టైం జాబ్ చెయ్యటం నేరం
దీనివల్ల భవిష్యత్తు పైన, చదువుల పైన, కెరీర్ పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. కాబట్టి ఏదైనా ఉద్యోగం చేయాలని భావించేవారు తప్పనిసరిగా మీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వైజర్ ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత cpt లేదా ఓపిటి మీద బయట పని చేసుకోవడానికి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. ఇవి వచ్చిన తర్వాత పనిచేస్తే తప్పులేదు కానీ, రాకముందు స్టూడెంట్ గా ఉన్నప్పుడు పనిచేయడం మాత్రం వీసా ఉల్లంఘనగా, నేరంగా పరిగణించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+