బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Student: టీచర్ కొట్టిన దెబ్బలకు ఐసీయూలో చేరిన విద్యార్థి, మాస్టర్ కు బీపీ వచ్చిందేమో ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్కూల్ కు వెలుతున్న కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే చూడాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. తండ్రి కష్టపడి అతని కొడుకును ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదవిస్తున్నాడు. అయితే స్కూల్ లో మాత్రం వేరే జరిగింది. బీపీ వచ్చిన లెక్కల్ టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మాస్టర్ కు బీపీ ఎక్కువ అయ్యిందేమో అని డౌట్ వస్తోందని విద్యార్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు.

Illegal affair: ప్రియుడి మోజులో పడిన ఆంటీ, భర్తను ప్రియుడు ఏం చేశాడంటే ?, భార్య నాటకాలతో షాక్!Illegal affair: ప్రియుడి మోజులో పడిన ఆంటీ, భర్తను ప్రియుడు ఏం చేశాడంటే ?, భార్య నాటకాలతో షాక్!

 ఐటీ హబ్ లో స్కూల్

ఐటీ హబ్ లో స్కూల్

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని విజయనగరలోని మాగడి రోడ్డులోని అనుభవనగర్ లో బ్లూబెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో విజయనగరలో నివాసం ఉంటున్న తన్మయ్ 6వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు వెలుతున్న కొడుకు తన్మయ్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే చూడాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. తండ్రి కష్టపడి అతని కొడుకు తన్మయ్ నిప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదవిస్తున్నాడు.

 అమ్మకు మ్యాటర్ చెప్పిన విద్యార్థి

అమ్మకు మ్యాటర్ చెప్పిన విద్యార్థి

ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లిన తన్మయ్ మద్యలో ఇంటికి వచ్చేశాడు. తన లెక్కల మాస్టర్ మాదేష్ తన చెంపపగలగొట్టాడని, చెవి, కన్ను నొప్పిగా ఉందని తన్మయ్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. తన్మయ్ చెవి, కంటి భాగంలో రక్తం గూడకట్టడంతో అందోళన చెందిన కుటుంబ సభ్యులు అతన్ని బెంగళూరులోని వాణివిలాస్ ఆసుపత్రికి తరలించారు.

 ఐసీయూలో విద్యార్థి

ఐసీయూలో విద్యార్థి

ప్రస్తుతం తన్మయ్ వాణివిలాస్ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నాడు. హోమ్ వర్క్ చెయ్యలేదని తన్మయ్ ని లెక్కల మాస్టర్ మాదేష్ ఇష్టం వచ్చినట్లు చితకబాదేశాడని, చెవి, కంటి దగ్గర గాయాలు అయ్యాయని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా లెక్కల మాస్టర్ మాదేష్ మీద స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన్మయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 టీచర్ కు కరోనా వచ్చిందని డ్రామాలు ?

టీచర్ కు కరోనా వచ్చిందని డ్రామాలు ?

ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థి ఐసీయూలో ఉన్నాడని వెలుగు చూడటం ఐటీ హబ్ బెంగళూరులో కలకలం రేపింది. స్కూల్ టీచర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని, పైగా టీచర్ కు కరోనా వచ్చి స్కూల్ కు రావడంలేదని చెబుతున్నారని తన్మయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

English summary
Shock: Student admitted in hospital after beating by school teacher in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X