యూఎస్ టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారికి షాక్.. వారికి వీసా రిజెక్షన్!

యూఎస్ వెళ్లాలనుకునే పర్యాటకులకు అమెరికా మరోమారు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా యూఎస్ వెళ్లాలని పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు గర్భిణీ స్త్రీలైతే అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తారని యూఎస్ స్పష్టం చేసింది.అమెరికా పౌరసత్వం కోసం తమ బిడ్డ అక్కడే జన్మించాలని ప్రత్యేకంగా చేసే ప్రయాణాల నిమిత్తం దరఖాస్తు చేసుకునే పర్యాటక వీసాలను నిరాకరిస్తామని అమెరికా మరోమారు స్పష్టం చేసింది.

ఆ దరఖాస్తులను తిరస్కరిస్తాం అని చెప్పిన యూఎస్
వీసా దరఖాస్తు ముఖ్య ఉద్దేశం అదే అని గ్రహిస్తే అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తారని తేల్చి చెప్పింది. ఎవరైనా పౌరసత్వాన్ని ఉద్దేశంగా పెట్టుకొని యూఎస్ కు ప్రయాణం చేయాలని గర్భిణీలు భావిస్తే అటువంటివారు టూరిస్ట్ వీసా దరఖాస్తులను వేయకుండా ఉంటేనే మంచిదని పేర్కొంది. ఇటువంటి ప్రాక్టీస్ ను ఏ విధంగాను అంగీకరించబోమని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తమ ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొంది.

Shock with US Tourist Visa Rules Pregnant Women Visa Rejection Clarified by US Embassy

Take a Poll

బర్త్ రైట్ సిటిజన్ షిప్ పై ట్రంప్ నిర్ణయం
ప్రస్తుతం టూరిస్ట్ విసాలలో ఉన్న నిబంధనలను గుర్తు చేస్తూ ఈ ప్రకటన చేసింది. ఇది మాత్రమే కాదు ఇప్పటికే యూఎస్ ప్రభుత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానం పైన కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం కల్పించే ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు.

వారు అమెరికన్ పౌరులు కాదనిఅ ట్రంప్ నిర్ణయం
ట్రంప్ వలస విధానాలలో సుప్రీంకోర్టు తుది తీర్పును కోరిన మొట్టమొదటి అంశం ఈ కీలక బర్త్ రైట్ సిటిజన్షిప్ వివాదమే కావడం గమనించాల్సిన అంశం. తాత్కాలికంగా అమెరికాలో నివసిస్తున్న, లేదా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు అమెరికన్ పౌరులు కాదని డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు ప్రస్తుతం పరిశీలిస్తోంది. దీనిపైన తుది తీర్పు త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తుంది.

అక్రమ వలసలను నియంత్రించాలని ట్రంప్ నిర్ణయాలు
ఒకవేళ ట్రంప్ ఉత్తర్వులు అమలులోకి వస్తే 14 రాజ్యాంగ సవరణకు సంబంధించి గత 125 సంవత్సరాలుగా నెలకొని ఉన్న అవగాహన పూర్తిగా మారిపోతుంది అన్న అభిప్రాయం ఉంది.
యూఎస్ లోకి అక్రమ వలసలను నియంత్రించాలని డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలలో జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ప్రతిపాదన చాలా ప్రధానమైనది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని తన ప్రచారంలో ఈ అంశాన్ని కీలకమైన వాగ్దానం గా ప్రచారం చేశారు.

లక్షల మందికి ఆశ్రయం కల్పించే స్తోమత అమెరికాకు లేదన్న ట్రంప్
పలు నగరాలలో వలసదారులను నియంత్రించడం, 18వ శతాబ్దపు ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ను అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. జన్మహక్కు పౌరసత్వం ద్వారా దేశంలోకి వస్తున్న లక్షల మందికి ఆశ్రయం కల్పించే స్తోమత అమెరికాకు లేదు అన్న అభిప్రాయం తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు. వలసల భారం దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువగా పడుతుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పౌరసత్వం ఉంటే ఏం చేస్తారో?
అంతేకాదు అప్పటికే పౌరసత్వం పొందిన వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనే దానిపైన ఇంకా ఆలోచించలేదని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ఏది ఏమైనా టూరిస్ట్ వీసాలతో వెళ్లి యూఎస్ లో డెలివరీ అయ్యి పిల్లలకు సిటిజన్షిప్ కావాలని ప్రయత్నం చేసే వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని చెప్పి ట్రంప్ షాక్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+