తాగి.. నటితో కపిల్ అసభ్యప్రవర్తన, కాజోల్ సోదరితోను
న్యూఢిల్లీ: 'కామెడీ నైట్ విత్ కపిల్' టెలివిజన్ కార్యక్రమంలో స్టార్ హోదా సంపాదించుకున్న కపిల్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. మరాఠీ నటి దీపాలీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అబాసుపాలయ్యాడు. తాను చేసిన పనికి అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో క్షమాపణలు కోరాడు.
అంతర్జాతీయ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివెల్ అవార్డు - 2015 పార్టీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగినట్లు కనబడిన కపిల్ శర్మ పలువురు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తనతో డ్యాన్స్ చేయాలని బలవంతం చేశాడు. మరాఠీ నటి దీపాలిని కూడా ఇదేవిధంగా బలవంతం చేశాడు.

అతడితో డ్యాన్స్ చేసేందుకు దీపాలి నిరాకరించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ... తనతో డ్యాన్స్ చేయాలని ఉందని కపిల్ శర్మ చెప్పాడని, కానీ తాను అంగీకరించలేదని, అతడికి దూరంగా వెళ్లిపోయానని, కపిల్ ఎవరో తనకు తెలియదని, తనకు తెలిసిన వారితోనే తాను డ్యాన్స్ చేస్తానని దీపాలి చెప్పింది.
తాను చేసిన తప్పిదంపై కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. క్షమాపణలు కోరాడు. కాగా, కపిల్ శర్మ... దీపాలితోనే కాకుండా పలువురు యువతులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాలని తెలుస్తోంది. కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ, మోనాలీ ఠాకూర్ తదితర యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు.












Click it and Unblock the Notifications