పారిపోయిన మొగుడు ఇన్‌స్టాలో దొరికిండు.. మరో అమ్మాయితో..!

ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్ల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మరో మహిళతో కనిపించి తన భార్యకు షాక్ ఇచ్చాడు.

అసలేం జరిగిందంటే.. ?
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా ఆత్మౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్, 2017లో మురార్‪నగర్‌కు చెందిన షీలు అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలానికే వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. అయితే 2018లో జితేంద్ర ఉన్నట్టుండి ఇంట్లోంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించినప్పటికీ జితేంద్ర ఆచూకీ మాత్రం లభించలేదు.

Shocking Incident in Uttar Pradesh Missing Husband Found on Instagram with Another Woman

జితేంద్ర కుమార్ కుటుంబం తన కుమారుడి మిస్సింగ్ వెనుక షీలు కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, షీలు తన కొడుకుతో కలిసి తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. అయితే, అకస్మాత్తుగా ఒకరోజు షీలు సోషల్ మీడియాలో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. ఆ రీల్స్ లుధియానాలో చిత్రీకరించినట్లుగా ఉన్నాయి, అందులో జితేంద్ర మరో మహిళతో కనిపించాడు.

తన భర్తకు మళ్లీ పెళ్లి అయిందని భార్య ఆరోపణ
"నేను 2017లో ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు," అని షీలు చెప్పారు. "నా భర్త కనిపించకుండా పోయినప్పుడు, అతని కుటుంబం నా కుటుంబంపై FIR నమోదు చేసింది. అయితే, నాకు ఆ విషయం కూడా తెలియదు. ఇప్పుడు, అతను లుధియానాలో మరో మహిళతో కలిసి ఉంటున్నారని, ఆమెను వివాహం చేసుకున్నాడని నేను రీల్స్ ద్వారా తెలుసుకున్నాను. నాపై పగబట్టి, నన్ను మోసం చేయడానికి అతని కుటుంబం మొత్తం కుట్ర పన్నిందని నాకు అర్థమైంది" అని షీలు ఆరోపించారు. ఈ క్రమంలో అతడిపై, అతడ కుటుంబ సభ్యులపై షీలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయంపై స్పందించిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ న్రిపేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "వారు వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఒక సంవత్సరం తర్వాత, అతను ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దానిపై ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడింది," అని తెలిపారు. జితేంద్ర బ్రతికే ఉన్నాడని వీడియోల ద్వారా షీలు నిర్ధారించుకున్న తర్వాత, ఆమె ఇటీవల ఫిర్యాదు చేసిందని, ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలో దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+