షాక్:మహిళల బట్టలూడదీశారు,కాదు విప్పుకున్నారు!

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రజల మాన, ప్రాణాలు కాపాడార్సిన పోలీసుల ఎదుటే... మహిళల దుస్తులు విచక్షణారహితంగా విప్పేసిన సంఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఇద్దరు దళిత మహిళల దుస్తులను విప్పేస్తుంటే పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుండిపోయారు. తాము చేసిన ఫిర్యాదు పైన ఆరా తీసేందుకు వచ్చిన సమయంలో... ఆ కుటుంబంలోని మహిళలు, పురుషుల బట్టలు ఊడదీశారు.

 Shocking! Lower caste women stripped, dragged in Uttar Pradesh; police watch silently

ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ బుద్దనగర్ ధన్‌కూర్ మార్కెట్‌లో గురువారం ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. సునీల్, గౌతమ్ అతని కుటుంబ సభ్యులు తమ ఇంట్లో మోటారు సైకిల్, నగదు, ఫోన్లు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో కేసు ఏమైందని తెలుసుకునేందుకు నిన్న సాయంత్రం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారి దుస్తులను విప్పారు. అయితే తాము ఎవరి బట్టలు ఊడదీయలేదని, బాధితులే నిరసన తెలుపుతూ బట్టలు విప్పుకున్నారని పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. దుస్తులు చింపుకున్నట్టు తమ వద్ద వీడియో కూడా ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+