షాకింగ్: నటి ఎదుటే కారులో హస్తప్రయోగం చేసిన డ్రైవర్!

ముంబై: నటి చిన్మయి సుర్వే ఓ గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై ముంబైలోని విలెపార్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి వద్ద బీఎండబ్ల్యూ కారులో కూర్చున్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, తనను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చదవండి: బురిడీ బాబా.. కిలాడి లేడీ, వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

ఆమె తెలివిగా ఆ కారు నంబర్‌లోని చివరి అక్షరాలు 1985 గుర్తుంచుకుని తన ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వెంటనే ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

man-arrest

మరోవైపు జరిగిన ఘటన గురించి చిన్మయి భర్త, బాలీవుడ్ నటుడు సుమిత్ రాఘవన్ తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. పార్లే తిలక్ స్కూల్ సమీపంలో వైట్ కలర్ బీఎండబ్ల్యూ కారును నిలిపి ఉంచిన డ్రైవర్ తన భార్య ఎదుటే ఈ అసహ్యమైన పనికి పాల్పడ్డాడని, అతడు అలా ప్రవర్తించడంతో షాక్ తిన్న తన భార్య వెంటనే ఇంట్లోనే ఉన్న తనను పిలిచిందని, తాను బయటికొచ్చి చూసే సరికి గ్రే కలర్ సఫారీ డ్రెస్ ధరించి ఉన్న డ్రైవర్ వెంటనే అక్కడ్నించి కారులో పరారయ్యాడని, అయితే కారు నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు గుర్తుంచుకుని ఈ విషయమై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆ తరువాత సుమిత్ మరో ట్వీట్‌లో దీనిగురించి మరో అప్‌డేట్ ఇచ్చారు. తాము సాయంత్రం 4.15 ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, జస్ట్ రెండు గంటల్లోనే కారు నెంబర్ ఆధారంగా నిందితుడిని వారు కనుక్కోగలిగారంటూ ముంబై పోలీసులకు, ముఖ్యంగా విలెపార్లె పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ ఫిర్యాదుపై వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేసిన సంబంధిత పోలీసు అధికారులకు శాల్యూట్ అంటూ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+