మూన్ లైటింగ్.. యూఎస్ లో భారతీయ ఉద్యోగికి షాక్.. 15ఏళ్ళు జైలుశిక్ష!

US అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి యూఎస్ ఎప్పుడూ వార్తలలోనే నిలిచి ఉంటుంది. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విదేశీ విద్యార్థుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా యూఎస్లో ఉన్న భారతీయ విద్యార్థులపైన, అక్కడ పనిచేస్తున్న మన వారిపైన ప్రధానంగా అందరూ దృష్టి సారించేలా చేసింది. ఇక ఇప్పటికే యూఎస్ కు వెళ్లిన విద్యార్థులు దయనీయమైన దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడిన భారతీయుడు
కొందరు విద్యార్థులు భిక్షాటన చేస్తూ కనపడగా, మరికొందరు దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డారు. ఇక తాజాగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక భారతీయుడు నిబంధనలను ఉల్లంఘించి రెండు ఉద్యోగాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడిన భారతీయుడిని న్యూయార్క్ పోలీసులుఅరెస్టు చేశారు..

shocking-moonlighting-indian-employee-in-the-us- may-sentenced-to-15-years-in-prison

Take a Poll

రెండు ఉద్యోగాలు చేస్తున్న భారతీయుడిని అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు
న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ లో ఉద్యోగం చేస్తున్న 39 సంవత్సరాల మెహుల్ గోస్వామి అనే వ్యక్తి కంపెనీకి తెలియకుండా మరొకచోట కాంట్రాక్టర్ గా కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ పోలీసులు అతడిని అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.

మూన్ లైటింగ్ చేస్తూ పట్టుబడిన భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్షకు ఛాన్స్
యూఎస్ లోని చట్టాలకు విరుద్ధంగా మూన్ లైటింగ్ చేస్తూ పట్టుబడిన భారతీయుడికి నేరం రుజువైతే 15 ఏళ్ల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది. కాగా ఇటీవల భారత సంతతి వైద్యుడు డాక్టర్ నీల్ కే ఆనంద్ కు అమెరికాలో 14 ఏళ్ల జైలు శిక్షను విధించారు. అక్రమంగా ఓపియోయిడ్ మందులను పంపిణీ చేయడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ పథకాలలో ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో దోషిగా తేలిన ఆయనకు 14 సంవత్సరాల జైలుశిక్ష విధించారు.

కటకటాల పాలైన భారతీయ ఉద్యోగి
ఇప్పుడు రెండు ఉద్యోగాలు చేస్తున్నందుకు భారతదేశానికి చెందిన మెహుల్ గోస్వామి అనవసరంగా కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటనతో భారతీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకా ఎవరైనా అలా యూఎస్ చట్టాలు తెలీకుండా రెండు ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడే మానుకోండి. అనవసరంగా జీవితాన్ని జైలుపాలు చేసుకోకండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+