మాజీ సైనికులకు తగ్గిపోతున్న సర్కారీ ఉద్యోగాలు-అగ్నిపథ్ ఆందోళనల వెనుక మరో షాకింగ్ రీజన్
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అగ్నిపథ్ పథకం ద్వారా తమను ఎంపిక చేస్తే ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఉండదనే ఆందోళన ఉద్యోగార్ధుల్లో పెరుగుతోంది. అదే సమయంలో మరో కారణం కూడా వారిలో ఆందోళన నింపుతోంది. అదే ప్రభుత్వ శాఖల్లో నానాటికీ మాజీ సైనికులకు తగ్గిపోతున్న ఉద్యోగాలు. దేశంలో గత కొన్నళ్లలో ప్రభుత్వ శాఖల్లో మాజీ సైనికులకు లభించిన ఉద్యోగాలే ఇందుకు నిదర్శనం.

అగ్నిపథ్ చిచ్చు
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. అంతే కాదు రైల్వే స్టేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో అభ్యర్ధుల్లో ఇంత ఆందోళన వ్యక్తం కావడానికి వెనుక గల కారణాలపై దేశవ్యాప్తంగా భిన్న చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఓ కీలక కారణాన్ని సమర్ధించేలా ఓ డేటా వెలుగుచూసింది. దీన్ని పరిశీలిస్తే అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొంటున్న యువత లో ఆక్రోశానికి కారణాలు ఇట్టే అర్ధంచేసుకోవచ్చు.

మాజీ సైనికులకు ఉద్యోగాలు కరవు
కొన్ని దశాబ్దాలుగా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు విరివిగా లభించేవి. మాజీ సైనికుల కోటాలో వీరికి ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ కొంతకాలంగా వివిధ కారణాలతో ప్రభుత్వ శాఖల్లో మాజీ సైనికులకు ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయి. వీరికి బదులుగా నైపుణ్యం కలిగిన వారిని, ప్రొఫెషనల్స్ ను నియమించుకునేందుకే మొగ్గుచూపుతున్నాయి. దీంతో సహజంగానే మాజీ సైనికులకు నిరాశ తప్పడం లేదు. ఆ పరిస్ధితిని కొంతకాలంగా దగ్గరగా గమనిస్తూ వస్తున్న ఆర్మీ అభ్యర్ధులకు అగ్నిపథ్ పథకం మరింత ఆగ్రహం తెప్పించింది.
Recommended Video


సర్కారీ నియామకాలపై షాకింగ్ రిపోర్ట్
తాజాగా వెలుగుచూసిన ఓ డేటా ప్రకారం 34 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10,84,705 గ్రూప్-సి ఉద్యోగుల్లో 13,976 మంది మాత్రమే మాజీ సైనికులు. ఇక మొత్తం 3,25,265 మంది గ్రూప్-డి ఉద్యోగుల్లో 8,642 మంది మాత్రమే మాజీ సైనికులు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. దీంతో అగ్నిపథ్ పథకంపై అభ్యర్ధుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇది గమనించిన కేంద్రం. ఇప్పుడు రక్షణ శాఖ ఉద్యోగాల్లో మాత్రం మాజీ సైనికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముందుకొచ్చింది. మిగతా ప్రభుత్వ శాఖల్లో మాత్రం వీరికి నియమకాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. దీంతో అగ్నిపథ్ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications