షాక్: రంగు మారిన సియాంగ్ నీరు, మృత్యువాత పడ్డ చేపలు, ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారత్‌ను ఇబ్బందులు పెట్టేందుకు చైనా తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. ఇండియాలోని నదులను లక్ష్యంగా చేసుకొని చైనా దొంగ దెబ్బ తీస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు జీవధారగా పేరొందిన సియాంగ్ నది నీరు నల్లరంగులోకి మారింది. ఈ నది నీరు రంగు మారడంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని విద్యార్థులు మోడీకి లేఖ రాశారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు తాగు, సాగు నీటిని అందించే సియాంగ్ నది నీరు కలుషితం కావడం పట్ల ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నది నీటిలో చైనా పారిశ్రామిక వ్యర్థాలను కలపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ నది నీరు నల్లగా మారడం ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ నీరు ఎందుకు కలర్ మారిందనే విషయమై తెలుసుకొనేందుకు నీటిని ల్యాబ్‌కు పంపారు.

నల్ల రంగులోకి సియాంగ్ నది నీరు
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగు నీటిని అందించే సియాంగ్ నది కలర్ పూర్తిగా మారిపోయింది. నల్ల రంగులోకి నది నీరు మారాయి. ఈ నీటిని వాడితే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పారిశ్రామిక వ్యర్థాల కారణంగానే ఈ నది నీరంతా కలర్ మారిపోయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఒడ్డుకు కొట్టుకు వచ్చిన జలచరాలు
బుదవారం నాడు సియాంగ్ నది జలాలు పూర్తిగా నలుపు రంగులోకి మారడాన్ని స్థానికులు గుర్తించారు.ఈ నీరు కలుషితమైంది. దీంతో నీటిలోని చేపలు మరణించాయి. మరణించిన చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఈ నీటిని తాగితే ప్రజలు మరణించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నీటిని వాడకూడదని హెచ్చరించారు.

వ్యర్థాలను నేరుగా నదిలోకి
ఖనిజం నుంచి లోహాలను వేరుచేయగా మిగిలిన శేషపదార్థాన్ని ఈ నీటిలోకి వదిలినట్టుగా ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. చైనా నుంచి ప్రవహించే ఈ నదికి సమీపంలో సిమెంట్, ఉక్కు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. అందులోని వ్యర్థాలను నదిలోకి వదిలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నీటిని ల్యాబ్ పంపిన అధికారులు
ఈ నీటి నమూనాలను పరీక్షల కోసం పంపించినట్టు స్థానిక అధికారులు తెలిపారు.ప్రతి ఏడాది రుతువులు మారే సమయంలో నదిలోని నీరు కొద్దిగా రంగు మారడం సహజమే అయినా.. ఈ స్థాయిలో మార్పుకు గురవడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విద్యార్థులు ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications