స్టార్ హీరో కేసులో సీఎం సంచలన వ్యాఖ్యలు, మర్దర్ కేసుతో అయిపోతుందా ?, మాకు తెలీదు !
కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పని మేము చేసుకుంటున్నామని, ఎవరి గురించో ఆలోచించే అవసరం మాకులేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. హీరో దర్శన్ ను హత్య కేసు నుంచి కాపాడటానికి పలుకుబడి ఉన్న వ్యక్తులు సీఎం సిద్దరామయ్యను కలిశారని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య హీరో దర్శన్ కేసు విషయం మాట్లాడటానికి నన్ను కలవడానికి ఎవరూ రాలేదని, బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య మన దేశంలో ఓ చట్టం ఉందని, ఆ చట్టం ప్రకారం తాము నడుచుకుంటామని, అది తప్పా మరేమీ చేయలేదని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

సినీ నటుడు దర్శన్ విషయంలో ఆయన్ను పలు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న మీడియా ప్రశ్నకు పోలీసులు ఏం నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదని సీఎం సిద్దరామయ్య అన్నాదు. దర్శన్ విషయంలో ఎవరూ మమ్మల్ని సహాయం చేయమని అడగలేదని, ఇది పుకారు అని సీఎం సిద్దరామయ్య అన్నారు. హీరో దర్శన్ ఉంటున్న పోలీస్ స్టేషన్ ముందు ఎందుకు టెంట్లు వేశారని, ఆ టెంట్ల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అడిగిన ప్రశ్నకు సామాన్యుల కోసం ప్రభుత్వం పని చేస్తుందని సీఎం సిద్దరామయ్య అన్నారు.
సామాన్యులు ఏం చెబితే అది మేము వింటామని, అందులో ఎలాంటి అనుమానం లేదని సిద్దరామయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను అరెస్ట్ చేయరాదన్న కోర్టు ఆదేశాలపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ కోర్టు ఆదేశాలపై తాను స్పందించను అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వేషపూరిత రాజకీయాలు చేయదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సిద్దరామయ్య అన్నారు.

పోలీసుల పనిలో మా ప్రభుత్వం జోక్యం చేసుకోదని, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సీఎం సిద్దరామయ్య అన్నారు. చట్టానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని అన్నారు. దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయడంలో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యడ్యూరప్పను నాశనం చేయబోతోందన్న కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన ఆరోపణలపై స్పందించిన సీఎం సిద్దరామయ్య ద్వేషపూరిత రాజకీయాలు మేము చెయ్యడం లేదని, చట్టాన్ని గౌరవిస్తున్నామని, చట్టపరంగానే పోలీసులు పని చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications