వివాదంలో సిద్దరామయ్య, నీట్ పరీక్షల రోజు ప్రమాణస్వీకారం అవసరమా సార్ ?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోదీ రోడ్ షో రోజు బెంగళూరులో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ రోడ్ షో రద్దు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరులో మోదీ రోడ్ షో వివాదానికి కారణం అయ్యింది.
అయితే ఇప్పుడు సిద్దరామయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదంలో చిక్కుకున్నారు. శనివారం పాడ్యమి అయినా లెక్కచెయ్యకుండా సిద్దరామయయ్య, డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చెయ్యడానికి కర్ణాటక గరవ్నర్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు.

శనివారం బెంగళూరులో నీట్ పరీక్షలు జరుగుతున్నాయి. నీట్ పరీక్షలకు చాలా రోజుల ముందే డేట్ ప్రకటించారు. అయితే నీట్ పరీక్షలు జరుగుతున్న సమయంలో బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు వాహన సంచారాన్ని నిషేధించారు. శనివారం ఉదయం 10. 30 గంటలకు మొదలైన నీట్ పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీట్ పరీక్షలు జరుగుతున్న రోజు సిద్దరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యడంతో కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు నానా ఇబ్బందులకు గురైనారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ విమర్శించారు. మే 7వ తేదీ, మే 8వ తేదీ బెంగళూరులో రోడ్ షో నిర్వహించకూడదని నానా హంగామా చేసిన మీరు నీట్ పరీక్షలు జరుగుతున్న రోజే సిద్దరామయ్యతో సీఎంగా ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారని బీఎల్ సంతోషం కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు.
నీట్ పరీక్షు రాయడాకి బెంగళూరు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని పోలీసు అధికారులకు సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఏమైన సమస్యలు ఉంటే పోలీసులను సంప్రధించాలని, మధ్యాహ్నం నీట్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చెయ్యాలని ఇప్పటికే పోలీసు అధికారులకు సూచించామని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications