Viral Video:. న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద సిద్దూకు పంజాబీల నివాళి..

పంజాబ్ సింగర్ సిద్దూ మూసె వాలా ఇటీవల దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. సింగర్‌గా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అతనికి న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద నివాళి అర్పించారు. అతని ఫోటో కనిపించగానే కేరింతలు కొట్టారు. పాట ప్లే అనగానే అరుపులతో ఆ ప్రాంతం మిన్నంటింది. అతి పెద్ద తెరపై మూసేవాలా పాటలను ప్రదర్శించారు. ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

కొందరు ఫ్యాన్స్ మూసేవాలా మాదిరిగా డ్యాన్స్ కూడా చేశారు. చాలా మంది ఉత్సాహంగా కనిపించారు. మూసేవాలాతోపాటు అతని తల్లి ఫోటోను కూడా ప్రదర్శించారు. చనిపోయిన తర్వాత సిద్దూకు అరుదైన గౌరవం దక్కింది. చాలా మంది పంజాబీలే ఉన్నారు. అతనిని వారంతా గుర్తుచేసుకున్నారు.

Sidhu Moose Wala Receives Tribute At New Yorks Times Square

మన్సా జిల్లాలో గల జవహర్కె గ్రామంలో సిద్దూపై ఫైర్ జరిగింది. మాన్సా నుంచి సిద్దూ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన సిద్దూను హుటాహుటీన మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా, వారికి ప్రాథమిక చికిత్స అనంతరం, మరో ఆస్పత్రికి తరలించారు. శుభదీప్ సింగ్ తన థార్ వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా కాల్పులు జరిగాయి.

సిద్దూ వయసు 28 ఏళ్లు.. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం 424 మందికి పోలీసు భద్రతను తొలగించింది. వారిలో ఆయన కూడా ఉన్నారు. భద్రత తొలగించిన కొన్నిరోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+