వావ్.. వదిన... మీ డ్యాన్స్ సూపర్.. నెటిజన్ల ఫిదా
పెళ్లిల్లో స్టెప్పులు వేయడం కామన్.. కుర్రకారు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీస్ డ్యాన్స్ చేయడం.. వీడియోలు వైరల్ కావడం ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. ఆ చోట ఈ చోట అనే కాదు.. చాలా మంది తమ కాలు కదుపుతున్నారు. ఇక్కడ ఓ వదిన డ్యాన్స్ చేసి ఇరగదీసింది. ఆ పెళ్లి ఎక్కడ జరిగింది.. అనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ వదిన చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
పెళ్లిళ్లలో సరదాగా స్టెప్పులేయడానికి ఇష్టపడుతుంటారు. స్టెప్పులేసి ఎదుటి వారి పట్ల తమ ప్రేమను చాటుకుంటారు. పెళ్లి వేడుకలో చేసిన డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వదిన తన మరిది పెళ్లిలో డ్యాన్స్‌చేసి.. మరిది పట్ల తన అభిమానాన్నిచాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా మంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. చాలా బాగుంది అని చెప్పి.. తెగ కామెంట్లు చేస్తున్నారు.

సల్మాన్‌ఖాన్, మాధూరి దీక్షిత్ జంటగా నటించిన 'హమ్ ఆప్‌కే హైకోన్' సినిమాలోని 'లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్ లేకే' అనే పాటను పెళ్లిలో ప్లే చేశారు. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం అతని వదిన ఈ పాటపై సరదాగా స్టెప్పులేస్తుంది. ఈ పెళ్లిలో కూడా ఒక మహిళ తన మరిది కోసం సరదాగా డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్‌లో ఆ మహిళ పాటకు తగ్గట్లుగా చక్కగా స్టెప్పులేసింది. తన వదిన చేస్తున్న డ్యాన్స్ చూసి.. కొత్త జంట ఆనందంతో చూస్తూ ఉండిపోయారు.
Recommended Video
వివాహనికి వచ్చిన అతిథులు కూడా మహిళ డ్యాన్స్ చూసి చప్పట్లతో ఉత్సాహపరిచారు. తమ మొబైల్‌లో మహిళ డ్యాన్స్‌ను రికార్డు చేశారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు., ఆ మహిళ జోష్ చూస్తే.. మాకు ఒక స్టెప్ వేయాలనుంది.. అంటూ కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications