భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు.. పిల్లలను కూడా !!
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. కానీ ఓ అక్కాచెల్లెళ్లు మాత్రం సభ్యసమాజం సైతం తలదించుకునే ఘటనకు తెరలేపారు. నైతిక విలువలను మంటగలుపుతూ.. మానవ సంబంధాలను కాలరాసే పనికి ఒడిగట్టారు.
విచిత్ర ఘటన..
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలోని పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు తన ఇద్దరు కుమార్తెలకు పదేళ్ల క్రితం పెళ్లి చేశాడు. కొన్నేళ్ల పాటు వీరి కాపురాలు సవ్యంగానే సాగాయి. ఇద్దరికి పిల్లలు కూడా పుట్టారు. అయితే దాదాపు ఆరు నెలల క్రితం వారి జీవితాలు అకస్మాత్తుగా మలుపు తిరిగాయి.

చిన్న కూతురు తన అక్క భర్తతో అక్రమ సంబంధం, ప్రేమ ఏర్పరచుకుంది. ఈ బంధం హద్దులు దాటి, కుటుంబానికి అనుమానం రావడంతో.. ఆ ఇద్దరూ ఒకరోజు రాత్రి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి, పెద్ద కూతురు (అక్క), చెల్లి భర్త కలిసి వారి కోసం వెతకడం ప్రారంభించారు.
వెతుకులాటలో మరో అనైతిక బంధం..
పారిపోయిన వారి కోసం ఎంత వెతికినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో వెతుకులాటలో కలిసున్న అక్క, చెల్లి భర్త (మరిది) మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగింది. పారిపోయిన వారు దొరకకపోవడంతో.. వాళ్లు లేకున్నా మనం కలిసి ఉందాం అనే ఉద్దేశ్యంతో వీరిద్దరూ ప్రేమలో పడి ఒకటయ్యారు. ఈ విచిత్ర వ్యవహారం గురించి తెలుసుకున్న తండ్రి, బంధువులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

ఈ వ్యవహారం కాస్తా ఆ నోటా.. ఈ నోటా పాకి తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నలుగురు కలిసి ఒకరికి ఒకరు భర్తలను మార్చుకోవడానికి అంగీకరించడం ఏంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తమ పిల్లలను కూడా పరస్పరం మార్చుకున్నారు. అక్క పిల్లలను చెల్లికి ఇవ్వగా.. చెల్లి పిల్లలను అక్క తీసుకుంది. వీరి చర్యలతో తమ కూతుర్ల ప్రవర్తనతో విసిగిపోయిన రైతు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన ఇద్దరు కూతుళ్లను.. వారిని పెళ్లాడిన భర్తలను ఇంట్లో నుంచి తరిమేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మరీ ఇంత ఛండాలంగా తయారయ్యారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
-
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications